ఒక్క డెల్టా వేరియంట్ తోనే ఆ దేశంలో లాక్ డౌన్

ఒక్క డెల్టా వేరియంట్ తోనే ఆ దేశంలో లాక్ డౌన్

ఒక్క డెల్టా వేరియంట్ తోనే ఆ దేశంలో లాక్ డౌన్

ముందస్తు చర్యగా న్యూజిలాండ్ లో లాక్ డౌన్  

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశాలు.. అయితే కరోనా నుంచి కోలుకునేటప్పటీకీ కొత్త వైరస్ లు అగ్రదేశాల్నీ భయపెడుతున్నాయి. న్యూజిలాండ్ లో  కేవలం ఒకే ఒక డెల్లా వేరియంట్ కేసు బయట పడింది. అయితే దేశ వ్యాప్తంగా ఈ డెల్టా వేరియంట్ వ్యాప్తిస్తుందనే భయంతో న్యూజిలాండ్ దేశ వ్యాప్తంగా కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ విధించినట్లు వార్తల్లో కథనాలొచ్చాయి. అయితే ప్రక్కదేశమైన సౌత్ వేల్స్ లో డెల్టా కేసులు 800 కంటే ఎక్కువ రికార్డు స్థాయికి చేరుకోవడంతో న్యూజిలాండ్ అప్రమత్తమైంది. అయితే న్యూజిలాండ్ లో కరోనా కేసులు తగ్గిన తరువాత మళ్లా తిరిగి కొత్తగా 10 కొవిడ్ కేసులు బయటపడ్డాయని, ఓ వ్యక్తికి డెల్టా వేరియంట్ సోకిందని ప్రధాని జసిండో ఆర్డెర్న్ వెల్లింగ్టన్ లో మీడియా ప్రకటనలో ప్రధాని తెలిపారు. మరో పొరుగు దేశమైన ఆస్ట్రేలియాలో డెల్టా, కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో న్యూజిలాండ్ లో ముందస్తుగా దేశ వ్యాప్తంగా లౌక్ డౌన్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *