దేశంలో పలుచోట్ల కరోనా.. డెల్టా కేసులు.. ఆంక్షలు

దేశంలో పలుచోట్ల కరోనా.. డెల్టా కేసులు.. ఆంక్షలు

దేశంలో పలుచోట్ల కరోనా, డెల్టా కేసులు, ఆంక్షలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది..ఓ పక్క కరోనా, డెల్టా వెరియంట్ తో ప్రధాన నగరాలైన బెంగళూరు, కర్నాటక, కేరళ, మంగళూరులలోనే అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,186 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విల్లడించింది. బెంగుళూరులో 296 మందికి, దక్షిణకన్నడలో 273 మందికి వైరస్‌ సోకిందని సర్కార్ తెలిపింది. రెండు జిల్లాల్లో ఒక కేసు కూడా లేదు. 12 జిల్లాల్లో 10 లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. 1,776 మంది తాజాగా కోలుకోగా 24 మంది మృతి చెందారు. దక్షిణకన్నడ, కోలారు, ఉడిపిలలో ముగ్గురు చొప్పున మృతి చెందగా, నాలుగు జిల్లాల్లో ఇరువురు చొప్పున, ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు.

అయితే కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు తీసుకున్నాయి. వీటికి సరిహద్దులుగా ఉన్న 8 జిల్లాల్లో వీకెండ్స్ కర్ఫ్యూను అమలు చేస్తున్నామని.. అత్యవసర సేవలు మినహా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు అవుతోందని కర్ణాక ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన బెల్గావి, బీదర్‌, విజరుపురా, కల్బుర్గిలతో పాటు కేరళ సరిహద్దులుగా కలిగిన దక్షిణ కన్నడ, కొడగు, మైసూరు, చామరాజ్‌ నగర్‌లలో ఆంక్షల మధ్య కర్ఫ్యూ అమలు చేస్తామని.. అయితే అత్యవసర సేవలు మినహా ఎవరూ బయటకి రావొద్దంటూ.. వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంబంధిత సంస్థలకు ఈ నిబంధనల నుండి వర్తించవని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *