ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా, డెల్టా..మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా అగ్రదేశాలు..!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా, డెల్టా..మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా అగ్రదేశాలు..!
  • అగ్ర దేశాల్లో పెరుగుతున్న డెల్టా కేసులు
  •  వైరస్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు
  • కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ను ఆకట్టుకునేందుకు..
  • ఆఫర్లు ప్రకటిస్తున్న అధికారులు

ప్రపంచ దేశాలను వణికించిన కరోనా ఇప్పుడు డెల్టా వేరియంట్ భయపెడుతోంది. అయితే కరోనా, డెల్టా వైరస్ పై అప్రమత్తతో ఉండాలని ఆయా దేశాలలో శాస్త్రవేత్తలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటి వైరస్ ల భారీ నుంచి తప్పుకోవడం కష్టంగానే మారిందని చెప్పొచ్చు. ఇందుకు విభన్నంగా కరోనా వ్యాక్సినేషన్లను వేయించుకునేందుకు వివిధ దేశాల్లో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఉదాహరణకు బ్రిటన్ ప్రభుత్వం వ్యాక్సిన్ వోచర్స్ అనే స్కీమ్ ను ప్రకటించింది. వ్యాక్సినేషన్ వేయించుకునే వారందరికీ  షాషింగ్ మాల్స్ లో వివిధ వస్తులపై డిస్కంట్ వోచర్స్, పిజ్జాతో సహా ప్రయాణించే వారిందరకీ ఉబెర్, డెలివెరూ, బోల్ట్ వంటి సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. ఈ ఆఫర్లు వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం చైనాను డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ఉహాన్ సిటీతో పాటు 40పైగా నగర్లాల్లో     కొత్తగా 250పైగా డెల్టా వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. ఫ్రావిన్స్ ప్రాంతంలో డెల్టా వేరియంట్ కేసులను అరికట్టేందుకు అధికారులు ఆంక్షలు విధించారు. 

చైనాలోని జింగ్ ఎయిర్ పోర్టుకు రష్యా నుంచి వచ్చిన ఫ్లైట్ ను శుభ్రం చేసిన 9 మంది ఎయిర్‌పోర్టు కార్మికులకు డెల్టా వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమై ఆంక్షలు విధించారు. చైనాలో బీజింగ్‌సహా పెద్ద నగరాల్లో డెల్టా తో పాటుగా కరోనా టెస్టులు    సంఖ్యను భారీగా పెంచారు. హునాన్‌ ప్రావిన్స్‌లోని జుజౌ సిటీలో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో 10.2 లక్షల మంది ఇళ్లకే పరిమితమయ్యారని ఓ సర్వేలో వెల్లడైయింది. చైనాలోని బీజింగ్‌లోకి పర్యాటకులు రాకుండా ఆంక్షలు విధించారు. పర్యాటక ప్రాంతాలైన జాంగ్‌జీజియాజీ, చాంగ్‌పింగ్‌లో లాక్‌డౌన్‌ విధించారు.

కరోనా, డెల్టా వైరస్ లను నియంత్రించేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోంది.ఆస్ట్రేలియాలో చాలా రోజులుగా వైరస్ ను కాపాడుకునేందుకు లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాక్సినేషన్‌ నెమ్మదిగా సాగుతున్న ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, థాయ్‌లాండ్, బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్, దక్షిణాఫ్రికాలో, ఫ్లోరిడాల్లో డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. పెద్ద నగరమైన సిడ్నీలో చాలారోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *