ధంతేరాస్ పండుగ…నవంబర్ 2 వరకే ఛాన్స్…!  

నవంబర్ 2న ధంతేరాస్ పండుగ జరుపుకోవడానికి పండుగ జరుపుకోవడానికి అంతా సిద్ధమయ్యారు. పేరుకు మాత్రమే దీపాల పండుగ…ప్రముఖంగా ఎవరి నోట వినిపించిన దీపావళి పండుగ అంటే పసిడి పండుగ అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే, దీపావళి పండగ నాడు కొద్దిగా బంగారం కొనేందుకు మనవాళ్లకు నిద్రపట్టదు మరీ.. అయితే ఇండియాలో ఉన్నా.. వృత్తి వ్యాపారాల రీత్యా విదేశాల్లో ఉన్నా.. దీపావళి పండగకు తమ శక్తిని అనుసరించి బంగారం కొనుక్కోవడం ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుంది. దీపావళి పూజకోసం కొనే బంగారం రూపులుగా అంటే గుండ్రటి రేకు బిళ్ళ పై లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. ఇలాంటి రూపులే కాకుండా.. లక్ష్మీదేవితో ఉన్న బంగారు వస్తువులు దీపావళి పండగ కోసం ధంతేరాస్ రోజున ప్రజలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడుతుంటారు.

ఈ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ప్రత్యేకంగా ‘ధంతేరాస్ స్టోర్’ ప్రారంభించింది. గోల్డ్ కాయిన్స్ (Gold Coins), సిల్వర్ కాయిన్స్ (Silver Coins), ఫెస్టీవ్ జ్యువెలరీ, పూజా వస్తువులు, హోమ్ డెకరేటీవ్ ప్రొడక్ట్స్, డిజిటల్ గోల్డ్ లాంటివన్నీ ఉంటాయి. ధంతేరాస్, దీపావళికి సంబంధించిన వస్తువులన్నీ ఈ స్టోర్‌లో కొనుకోవచ్చు.

ఇక ధంతేరాస్ సందర్భంగా గోల్డ్ కాయిన్స్ పై 20 శాతం కాగా, వెండి నాణేలపైనా 20 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఇక బంగారు నగలు, సిల్వర్ జ్యువెలరీపై 40 శాతం తగ్గింపు లభిస్తుంది. డైమండ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలు 0 శాతం ఇవ్వగా.. గోల్డ్ బ్రాండ్ వోచర్లపై 3 శాతం తగ్గింపుతో అమెజాన్ స్టోర్స్ లభించడం విశేషం.

ఈ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, కొటక్ బ్యాంక్ కార్డ్స్, రూపే కార్డ్ తో 10 శాతం  డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్-పే యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ పే లేటర్ తో పాటుగా EMI ఆఫర్స్ కూడా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *