ధోనికీ షాకిచ్చిన ట్విట్టర్

ధోనికీ షాకిచ్చిన ట్విట్టర్

ధోనికీ షాకిచ్చిన ట్విట్టర్

ట్విట్టర్ అభిమానుల  ఆగ్రహం

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనికి షాకిచ్చిన ట్విటర్‌.. ధోని అకౌంట్‌ నుంచి బ్లూ వెరిఫైడ్‌ టిక్‌మార్క్‌ను తొలగించింది. అయితే ట్విటర్‌ ఆ టిక్‌ను ఎందుకు తొలగించించారన్న దానిపై స్పష్టత రాలేదు. ట్విటర్‌లో ఎంస్ ధోనీ కొంతకాలంగా యాక్టివ్‌గా లేకపోవడంతోనే ఇలా జ‌రిగి ఉంటుంద‌ని సమాచారం. ధోని ఈ ఏడాది జనవరి 8న చివరి ట్వీట్‌ చేశాడంటూ వార్తలొచ్చాయి. అప్పటినుంచి ధోని ట్విటర్‌లో​ యాక్టివ్‌గా లేడని ట్విట్టర్ తెలిపింది. ట్విటర్‌ రూల్స్‌ ప్రకారం ఆరు నెల‌ల పాటు ఒక వ్యక్తి అకౌంట్‌లో లాగిన్ కాకుంటే సదరు ట్విట్టర్ సంస్థ బ్లూ టిక్‌ తొలగిస్తుంది. ఈ నియమం అనేది ఏ ఖాతాదారుడికైనా వర్తిస్తుంది. ఒకవేళ బ్లూ టిక్‌ మళ్లీ కావాలంటే వెరిఫికేష‌న్ కోరుతుంది.

అయితే ధోని ట్విటర్‌కు బ్లూ టిక్‌ తొలగించడంపై అతని క్రికెట్ అభిమానులు, స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తొలొచ్చాయి. బ్లూటిక్‌ను యాడ్‌ చేయాలంటూ ట్విటర్‌ సంస్థను అభిమానులు డిమాండ్‌ చేశారు.

ఇదే విషయంపై క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్న విషయాన్ని కూడా ధోని ట్విటర్‌లో కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలోనే షేర్‌ చేస్తూ ఎంఎస్ ధోనీ వచ్చాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన ధోని ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. గతంలో కూడా వెంకయ్యనాయుడు అకౌంట్ ను కూడా ట్విటర్‌ తొలగించారట. తరువాత వెంటనే బ్లూ టిన్ ను పెట్టామని యాజమాన్యం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *