షుగర్ పేషంట్స్ ఈ హెల్తీ డ్రింక్స్ తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా?

షుగర్ పేషంట్స్ ఈ హెల్తీ డ్రింక్స్ తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా?

మధుమేహం ఒక వ్యక్తిని పూర్తిగా ప్రభావితం చేసే వ్యాధి. ఈరోజుల్లో డయాబెటిస్ పూర్తిగా నయం చేయాడం సాధ్యం కాదని, అయితే దాన్ని నియంత్రించవచ్చని అంటారు. దీనికి బ్లడ్లో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. మధుమేహంతోపాటు మూత్రపిండాలు, మూత్రం కూడా సమస్య ఉండవచ్చు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వారి షుగర్ లెవల్ ను నియంత్రించడానికి వారి ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి.

ముఖ్యంగా ఈ కూరగాయల రసంతో పాటుగా పండ్ల రసాలతో మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు..?

కాకరకాయ జ్యూస్:  

కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగితే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చని కొన్ని అధ్యయనాల్లో వెలువడినాయి. కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. కాకరకాయ జ్యూస్‌లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కాకరకాయ జ్యూస్ గ్లూకోజ్ మొత్తాన్ని నియంత్రించడమే కాకుండా అనేక కడుపులో వచ్చే వ్యాధులను కూడా నియంత్రిస్తుంది.

కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. కాకరకాయల్లో సమృద్ధిగా ఉండే ఫైబర్ మలబద్దక సమస్యను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం ఉండవు.

బీట్ రూట్ జ్యూస్.. 

శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.

బీట్ రూట్ గురించి పరిశోధన ప్రకారం రోజుకి 400 మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది.

చలికాలంలో బీట్ రూట్  తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అనేక వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. బీట్ రూట్‌లో బోరాన్ ఎక్కువగా ఉన్నందు వలన శృంగార హార్మోన్లను ఎక్కువ చేస్తుంది.

బీట్‌రూట్‌లో నైట్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.

సౌందర్యానికి విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది.

రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది.

కీరా దోసకాయ:

కీరదోసకాయ నీటి జాతి సంసతతికి చెందినది. జ్యూస్ రూపంలో కీర జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరరం రోజుంతా హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవచ్చు. ఈ రసం ద్వారా చర్మానికి తేమను అందించి పొడిబారకుండా మృదువుగా ఉండడానికి సహాయపడుతుంది.

ఇందులో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, బీ1, విటమిన్ సీ, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కీరదోసకాయ రసం శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అంతేకాదు ఇది వేడి, ఇన్ఫెక్షన్, వాపు, కీళ్లనొప్పులను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.శరీరంలో డీహైడ్రేషన్ తొలగి, శరీరం చల్లగా మారుతుంది.

ఎవరికైనా థైరాయిడ్ గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి పనిచేయకపోతే కీర జ్యూస్ తాగితే అధిక స్థాయిలో కాల్షియం భర్తీ చేయొచ్చు. సో దీంతో హార్మోన్ల స్థాయిని సాధారణ స్థితిలో ఉంచుతుంది.

షుగర్ ఉన్న వాళ్లు కొబ్బరి నీళ్లు తాగొచ్చా..?

కొబ్బరి నీళ్లలో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సీ, సోడియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా కొబ్బరిలో ఉంటాయి. కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు, ఇది డయాబెటిస్ పేషంట్లకు మంచి ఆరోగ్యకరమైన పానీయం.

కొబ్బరి నీళ్లలో మూడు గ్రాముల పీచు పదార్థం, ఆరు గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. కాబట్టి.. డయాబెటీస్ బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని పరిశోధకులు అంటున్నారు.

కొబ్బరి నీళ్లు ఇన్సులిన్‌ గుణాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో చక్కెరను తగ్గించే మెగ్నీషియం ఉంటుందట. ఫలితంగా టైప్-2 డయాబెటీస్, ప్రీ-డయాబెటీస్ బాధితులకు మంచే చేస్తుందట.

డయాబెటిస్ రోగులపై నిపుణులు అధ్యయనం చేసిన ప్రకారం.. డయాబెటిస్ రోగులు రోజుకు కనీసం 200 మిల్లీ లీటర్ల కొబ్బరి నీరు తాగడం మంచిదేనని, అంతకు మించి తాగడం సురక్షితం కాదని పేర్కొంది. మరింత సమాచారం తెలుసుకోవాలన్నా తప్పకుండా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించాలని మనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *