ద డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ..ప్రకాష్ రాజ్  

ద డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ..ప్రకాష్ రాజ్  

ద డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ..ప్రకాష్ రాజ్  

నా సర్జరీ పూర్తియింది.. నేను తిరిగి వస్తా   

ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ చేతికి గాయమైన విషయం మనకు తెలిసిందే…అయితే తాను క్షేమంగా ఉన్నానంటూ.. ‘డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌ అని.. నా సర్జరీ విజయవంతంగా పూర్తయిందంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. డాక్టర్‌ గురువారెడ్డి ఆధ్వర్యంలో నాకు శస్త్రచికిత్స జరిగిందని..నేను క్షేమంగా ఉండాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను త్వరలోనే తిరిగి నటిస్తానని తెలిపారు.

తమిళ నటుడు ధనుష్‌ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌ నటిస్తున్నారు. షూటింగ్ లో పాల్గొన్న సన్నివేశంలో ఆయన ప్రమాదానికి గురయ్యారు. చేతికి గాయమవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ప్రకాశ్ రాజ్ కు సర్జరీ సక్సెస్ తో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: