దీపావళి రోజు ఈ క్రాకర్స్ నే వాడండి.

దీపావళి పండుగ వేళ బేరియం సాల్ట్ తో తయారు చేసిన క్రాకర్స్ అమ్మకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల అధికారులను ఆదేశించింది. దీనిలో క్రాకర్స్ అమ్మే వారు నిబంధనలు ఉల్లంఘింస్తే  వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. కాగా, బేరియం సాల్ట్ తో తయారు చేసిన టపాసులు అమ్మొద్దని గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటికి బదులుగా గ్రీన్ కాకర్స్ అమ్మాలని, వాటినే కాల్చాలని ఆదేశాలు ఇచ్చింది.

దీపావళి రోజున వాడాల్సినవి: హరిత టపాసులు(గ్రీన్ క్రాకర్స్) చక్కని ప్రత్యామ్నాయంగా మారాయి. తక్కువ కాలుష్యం వచ్చే హరిత టపాసులనే దీపావళి రోజున వినియోగించాలని దేశ వ్యాప్తంగా పండుగ జరుపుకునే ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. తక్కువ బూడిద, ముడి పదార్థాలను వాడి చిన్న సైజులో హరిత టపాసులను మాత్రమే వాడాలి.

దీపావళి రోజు కాలుష్య మండలి అనుమతినిచ్చిన చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, బాంబులనే వాడాలి. ఈ టపాసులు 30 నుంచి 50 శాతం తక్కువ ధూళి కణాలను విడుదల చేస్తాయని… కాలుష్యకారక వాయువులు, పొగ, శబ్దాలు కూడా తక్కువగానే విడుదలచేస్తాయి. దీంతో పండుగ జరుపుకునే వారికి కొంత ఇబ్బందులు కలగవు. వీటిని ఆన్‌లైన్‌లోను మనకు అందుబాటులో ఉండే షాపులలో లభిస్తాయి. వీటిపై ప్రత్యేకంగా గ్రీన్‌లోగో, క్యూ ఆర్‌ కోడ్‌ ఉంటాయి.

దీపావళి రోజున వాడాకూడనవి: టపాసుల నుంచి బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులు, లోహాల ధూళి వెలువడుతోంది. వీటి వల్ల ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయి. అందుకే వీటిని వాడొద్దని ప్రజలకు వినతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *