LATEST:ఒమిక్రాన్ లైట్ తీసుకోవద్దు: WHO వార్నింగ్

LATEST:ఒమిక్రాన్ లైట్ తీసుకోవద్దు: WHO వార్నింగ్

ఒమిక్రాన్ ను లైట్ తీసుకోడానికి వీల్లేదని అంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO). కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందనీ… ఇది కూడా ప్రాణాంతక వేరియంటే అని హెచ్చరించారు WHO చీఫ్ టెడ్రోస్ అధానమ్. ఒమిక్రాన్ బాధితులు కూడా లక్షల్లో హాస్పిటల్స్ లో చేరుతుండగా… మరణాలు కూడా ఉన్నాయని తెలిపారు. కేసులు కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గతంలో వచ్చిన వేరియంట్స్ లాగే ఇది కూడా ప్రమాదకరమైనది అన్నారు. టీకాలు తీసుకున్న వారిలో డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉంది. అయినప్పటికీ కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ బాధితులతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల ఆరోగ్యవ్యవస్థను ఒమిక్రాన్ తలకిందులు చేస్తోందని అంటున్నారు టెడ్రోస్‌.
కొన్ని దేశాలు తమ ప్రజలకు రెండు టీకాలు పూర్తిచేసి… బూస్టర్ డోసులు కూడా ఇస్తున్నాయి. కానీ ఇంకా ప్రపంచంలోని చాలా దేశాల్లో జనానికి ఒక్క డోసు కూడా అందలేదు. ఈ పరిస్థితుల్లో కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తూనే ఉంటాయనీ… బూస్టర్ డోసుల ఇచ్చినంత మాత్రాన కరోనా అంతం చేయలేమని అన్నారు WHO చీఫ్ టెడ్రోస్.

ఒమిక్రానే చివరిది కాదు… ఇంకా వస్తాయ్ :WHO

ఒమిక్రాన్ తోనే కరోనా అంతం అవుతుందని చెప్పలేమని WHO అంటోంది. భవిష్యత్తులో ఇంకా కొత్త వేరియంట్స్ వచ్చే ఛాన్సుందని అంటున్నారు. WHO కోవిడ్ టెక్నికల్ లీడ్ మరియా వాన్‌ కెర్ఖోవ్‌. జనం జాగ్రత్తగా ఉండాలనీ… వైరస్‌ నుంచి రక్షణ కోసం తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ముక్కు, నోరు మూసుకునేలా మాస్కులు ఉండాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: