DRDOలో అప్రెంటిస్‌ పోస్టులు..ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

DRDOలో అప్రెంటిస్‌ పోస్టులు..ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

DRDOలో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? 

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మొత్తం 106 అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిఆర్డీఓలో ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ప్రీమియర్ ల్యాబరేటరీ ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

కావాల్సిన అర్హతలు: మొత్తం ఖాళీలు: 106

చదువు:  B.Tech, BE, పోస్టులు: అప్రెంటీస్‌ 50 మంది అభ్యర్థులు

టెక్నీషియన్‌ (డిప్లొమా)అప్రెంటీస్‌ 30,ట్రేడ్‌ అప్రెంటీస్‌ 26 ఖాళీలు

చదువు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత బ్రాంచ్‌లో B.Tech, BE ఉత్తీర్ణులై ఉండాలి.

Technical:  టెక్నీషియన్‌ అప్రెంటీస్‌కు దరఖాస్తు చేసుకునే వారు సంబంధింత బ్రాంచ్లో డిప్లొమా చేసి ఉండాలి. (ఎలక్ట్రీషియన్, ఫిట్టర్)ట్రేడ్‌ అప్రెంటీస్‌కు పోస్టుకు సంబధిత ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇక ఈ పోస్టులకు 2019, 2020, 2021లో BE, B.Tech, Diploma, BBA, Bcom, ITI ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. Post Graduation (పోస్ట్‌  గ్రాడ్యుయేషన్‌) చేసిన వారు దరఖాస్తు చేసుకోరాదు.

ఎలా అప్లై చేసుకోవాలి: అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జీతం: నిబంధనల మేరకు DRDOలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 9000, టెక్నీషియన్‌ అప్రెంటీస్‌ పోస్టుకు రూ. 8000 స్టైపెండ్‌ ఇస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్టింగ్‌ చేస్తారు.. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తారు. తదనంతరం అభ్యర్థులు వారికి కేటాయించిన ప్రదేశంలోనే ట్రైనింగ్ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: