డ్రగ్స్ కేసులో 12మంది సెలబ్రెటీలకు ED నోటీసులు..

డ్రగ్స్ కేసులో 12మంది సెలబ్రెటీలకు ED నోటీసులు..

డ్రగ్స్ కేసులో 12మంది సెలబ్రెటీలకు ED నోటీసులు..

ఇన్విస్టిగేషన్  ఎదుట హాజరుకావాలని ఆదేశం

నాలుగేళ్ల కింద టాలీవుడ్ ని షేక్ చేసిన డ్రగ్స్ కేసు మళ్లీ ఇప్పడు తెరపైకి వచ్చింది. అయితే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏకంగా 12మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసింది. అయితే ఇందులో 12మంది డ్రగ్స్ ట్రాఫికింగ్ తో సన్నిహిత సంభంధాలున్నాయని అనుమానం వ్యక్తం చేస్తోంది.

అనుమానిస్తున్న టాలీవుడ్ సెలబ్రెటీస్ ఆగస్టు 31న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో సహా పూరి జగన్నాథ్ ను కూడా ఇన్విష్టిగేషన్ కు రమ్మని పిలిచారు. అయితే తాజాగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ తో సహా మాస్ మహారాజా రవితేజ, ఛార్మికౌర్, హీరో నవదీప్, ఐటమ్ గార్ల్ ముమైత్ ఖాన్, తరుణ్, తనీష్, నందులకు విచారణకు రమ్మని పిలుపునిచ్చారు ఈడీ. తాజాగా కొత్త ట్విస్ట్ ఏమిటంటే తెరపైకి దగ్గుబాటి రాణా కూడా సంబంధం ఉందని అనుమానాలు తెరపైకి వచ్చాయి.

అయితే ఈ సెలబ్రెటీలపై సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరుగుతుందని ఈడీ తెలిపింది. అయితే వీరిపై ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ వారికి ఇన్వెస్టిగేషన్లను చేపట్టామని ఈడీ తెలిపింది. అయితే ఇంకో విషయమేమిటంటే స్పెషల్ ఇన్విష్టిగేషన్ టీమ్, సెలబ్రిటీలకీ వ్యతిరేకంగా ఆధారాలు సేకరించలేకపోయారయని తెలిపారు.

డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై స్పెషల్ అధికారి చెబుతూ.. ఇప్పటికే 11మందిపై ఛార్జిషీట్లు ఫైల్ అయ్యాయని.. ఇన్విస్టిగేషన్ కోసం 8మంది ఇంచార్జీలను నియమించామని.. కానీ వారంతా చిన్న అధికారులని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా.. సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న రవితేజతో సహా మరికొంతమంది ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *