ఈడీ ఎదుట విచారణకు రవితేజ, నవదీప్

ఈడీ ఎదుట విచారణకు రవితేజ, నవదీప్

ఈడీ ఎదుట విచారణకు రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్, నవదీప్

డ్రగ్స్‌ కేసులో దగ్గుబాటి రానాను ప్రశ్నించిన ఈడీ అధికారులు 

డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో భాగంగా సినీ నటుడు రవితేజ, డ్రైవర్ ను విచారించనున్న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు, డ్రగ్స్‌ కేసు విచారణలో కెల్విన్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్ ను విచారణ జరపనున్న ఈడీ అధికారులు. సినీ నటుడు పి.నవ్‌దీప్‌ హాజరు అవుతారని.. అనివార్య కారణాల నేపథ్యంలో ఆయన కూడా గురువారం హాజరుకావడానికి అనుమతి కోరినట్లు సమాచారం

డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో భాగంగా సినీ నటుడు దగ్గుబాటి రానాను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసు విచారణలో కెల్విన్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే రానా విచారణ జరిపిన ఈడీ అధికారులు. రానాను దాదాపు బుధవారం ఏడున్నర గంటల పాటు విచారణ చేశారు ఈడీ అధికారులు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న సినీ ప్రముఖులందరినీ విచారిస్తున్న సంగతి తెలిసిందే.

రానా తన బ్యాంకు లావాదేవీల వివరాలను ఈడీకి ఇచ్చారు. ఎఫ్‌–క్లబ్‌లో జరిగిన పార్టీకి హాజరయ్యారా? లేదా అన్న కోణంలో ఈడీ విచారణ చేసింది. ఆ తర్వాత కెల్విన్‌కు నగదు లావాదేవీలతో పాటుగా తదితర అంశాలపై రానాను ప్రశ్నించారు. కెల్విన్‌ బ్యాంక్‌ ఖాతా వివరాలు సేకరించిన అధికారులు అందులో దగ్గుబాటి రానా అకౌంట్ నుంచి నగదు బదిలీ అయినట్లు గుర్తించారని సమాచారం. రానా సాయంత్రం 6 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోగా, ఆ తర్వాత 2 గంటల పాటు కెల్విన్‌ విచారణ సాగింది. ప్రతి కేసులోనూ కెల్విన్ విచారిస్తున్న ఈడీ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *