డ్రగ్స్ కేసులో సినీ సెలెబ్రెటీల విచారణ సమాప్తం
డ్రగ్స్ కేసులో సినీ సెలెబ్రెటీల విచారణ సమాప్తం
2017 లో డగ్స్ కేసు
తొలుతగా పూరీ జగన్నాథ్
కేసుతో సంబంధమున్న సెలబ్రెటీలను ప్రశ్నించిన ఈడీ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురి సినీ నటులను విచారించిన సంగతి తెలిసిందే. తొలుత పూరీ జగన్నాధ్ తో మొదలై చివరకు హీరో తరుణ్ తో ముగిసింది. దీనిలో భాగంగా బుధవారం నాడు ఈడీ ఎదుట హీరో తరుణ్ హాజరయ్యారు. ఉదయం ఈడీ కార్యాలయానికి తన బ్యాంకు ఖాతాల వివరాలతో వచ్చిన తరుణ్‌ను ఈడీ అధికారులు దాదాపు 8 గంటలపాటు తరుణ్ ని ప్రశ్నించారు. అయితే సినీ సెలబ్రెటీలను విచారించినప్పుడుల్లా..డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్ తో పాటు సెలబ్రెటీలను విచారించారు. ఈ వ్యవహారంలో అందరి సెలబ్రెటీల బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు.
2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులోనూ సినీ నటుడు తరుణ్ విచారణ ఎదుర్కొన్నారు. నేను డ్రగ్స్ తీసుకోలేదని.. అవసరమైతే అన్నీ పరీక్షలు చేయించుకోవచ్చునని అప్పట్లో తరుణ్ చెప్పగా..గోళ్లు, వెంట్రుకలు, రక్త నమూనాలు సైతం.. డ్రగ్స్ పరీక్షల కోసం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తరుణ్ డ్రగ్స్ వాడినట్టు ఎఫ్ఎస్ఎల్ (FSL)నివేదికలో తేలలేదని కూడా ఎక్సైజ్‌శాఖ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. కాగా, ఎక్సైజ్‌శాఖ విచారణలో క్లీన్చిట్ వచ్చిన తరుణ్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ (ED) అధికారులు తరుణ్ ని మరలా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పబ్‌ల నిర్వహణ, పార్టీలు, సినీ తారలతో పరిచయాలు…వీకెండ్పార్టీలు, డ్రగ్ సప్లై చేసే కెల్విన్, ఈవెంట్ మేనేజర్ జీషాన్అలీలతో ఎలాంటి పరిచయంతో పాటుగా వారివురి మధ్య ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా?..ఇలా పలు అంశాలపైనా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తరుణ్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. విచారణ అనంతరం తరుణ్‌తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా తరుణ్ కారులో ఎక్కి వెళ్లిపోయారు. గత నెల 31న ప్రారంభమైన ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. డ్రగ్ కేసులో మొత్తం 12మంది సినీ సెలబ్రెటీలను ఈడీ సమన్లు జారీ చేయడంతో కొన్ని రోజుల వ్యవధితో వారందరినీ ప్రశ్నించడం..కేసులో కీలకంగా ఉన్న కెల్విన్‌ను, జీషాన్ అలీలను సైతం వారితో కలిపి విచారించడం వంటి అనేక ఆసక్తికర మలుపులతో ఈడీ దర్యాప్తు కొనసాగింది. అయితే ఈ కేసులో దర్యాప్తు 12 మందిని ప్రశ్నించారు..కాగా ఇంకా ఎవరినైనా ప్రశ్నింస్తారా..?..ఇప్పటి వరకు సేకరించిన వివరాలు సరిపోతాయా అన్న ప్రశ్నలు సినీ ఇండస్ట్రీతో పాటుగా రాజకీయ నాయకులలో కూడా సందిగ్ధం ఏర్పడుతోంది. ఈ దిశగా ఇంకెవరికైనా సమన్లు జారీ చేసే అవకాశం ఉందా?..అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏదీ ఏమైనా డ్రగ్ కేసులు టాలీవుడ్ నంతా షేక్ చేసింది.