డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరైన రకుల్ ప్రీతి సింగ్

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరైన రకుల్ ప్రీతి సింగ్

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరైన రకుల్ ప్రీతి సింగ్

టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో ఒకరి తరువాత ఒకరు ఈడీ ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)హాజరవుతున్నారు. ఈ డ్రగ్స్ కేసులు తెలుగు సినీ పరిశ్రమలో అందరినీ కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విచారణ మరింత వేగవంతం చేసింది. నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను దాదాపు 6 గంటల ఈడీ అధికారులు ప్రశ్నించారు. రకుల్‌ బ్యాంకు ఖాతాలు వివరాలు అడుగగా రకుల్ అధికారులకు సమర్పించింది. అయితే బ్యాంక్ లావాదేవీలపై రకుల్ ని ప్రశ్నించినట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాలతో ఉన్న సంబంధాల పై ఈడీ అధికారులు ఆరా తీశారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీతి సింగ్ నుంచి స్టేట్ మెంట్ లిఖిత పూర్వకంగా నమోదు చేసుకున్నారు ఈడీ అధికారులు. ఆమెను ప్రశ్నించగా.. ఈడీ అధికారులు నన్ను ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు అవుతానని తెలిపారు.

అయితే నాకు షూటింగ్స్‌ లో ఉండటం వల్ల నేను విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. హాజరయ్యేందుకు నాకు గడువు టైమ్ ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్‌ కోరారని సమాచారం. దీనిపై స్పందించిన అధికారులు.. మీకున్న టైమ్ లోనే విచారణకు రావాలని ఈడీ ఆదేశించినట్లు రకుల్ తెలిపారు. అందుకు ఆమె అంగీకరించి మూడు రోజుల ముందుగానే  వచ్చానని తెలిపారు.
రకుల్ ప్రీతి సింగ్ తరువాత.. ఈ నెల 8న ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్న రానా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *