డ్రగ్స్ కేసులో ఛార్మిని రేపు విచారించనున్నఈడీ

డ్రగ్స్ కేసులో ఛార్మిని రేపు విచారించనున్నఈడీ
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ను కుదిపేసిన సంగతి అందరికీ తెలిసిందే.. ఒకరి తరువాత ఒకరు సెలబ్రెటీలు ఈడీ ఎదుట హాజరవుతున్నారు. అయితే ఈ కేసులో ఈడీ ఎదుట హాజరుకావాలనీ నటి చార్మీకి నోటీసులు వచ్చాయి. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నటి చార్మీకి నోటీసలు జారీ చేశారు. అయిదే ఈ దిశగా ఛార్మీ అకౌంట్లను పరిశీలిస్తున్న (ED) ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.
డ్రగ్స్ కేసులో చార్మీ అకౌంట్ నుంచి కెల్విన్ అకౌంట్లోకి నగదు బదిలీ చేసిందా లేదా..చార్మీ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనుంది. అయితే అసలు కెల్విన్ తో వ్యాపార లావాదేవీలు, ఛార్మీ డ్రగ్స్ సేవించిందా లేదా.. అసలు కెల్విన్ తో ఛార్మీకి సంబంధాలున్నాయా అన్న కోణంలో ఈడీ విచారణ చేయనుంది. ఛార్మీ అకౌంట్ నుంచి ఎవరెవరికీ మనీ ట్రాన్సఫర్లు అయ్యేయో లేదో అని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరా తీయనుంది. ఈ డ్రగ్స్ కేసులో ఇంకెంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది.. అయితే ఇప్పటికే కొంతమంది సెలబ్రెటీలకు డేట్లు ప్రకటించి వారిని విచారించనున్న ఈడీ అధికారులు.