డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరైన ఛార్మీ  

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరైన ఛార్మీ  

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరైన ఛార్మీ  

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ను షేక్ చేసిన విషయం అందిరికీ తెలిసిందే.. ఈ  డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ చార్మిని దాదాపు 8 గంటల పాటు విచారణ చేశారు  ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. ఇదే కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను విచారించిన సంగతి తెలిసిందే.. అయితే ఛార్మిని మనీ లాండరింగ్ తో పాటుగా బ్యాంక్ లావాదేవీలపై..  ఈడీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఇదే కేసులో తెలుగు ఫిల్మీం ఇండస్ట్రీకి చెందిన 12 మందికి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించిన విషయం గతంలో అందరికి తెలిసిందే. హైదరాబాద్ ఈడీ ఆఫీసులో విచారణ ముగించుకుని బయటకు వచ్చిన నటి చార్మి.. ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కేసు విచారణ జరుగుతున్నందున నేను ఎక్కువగా మాట్లాడలేక పోతున్నానని… అయితే ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, లావాదేవీల వివరాలు అడిగితే డాక్యుమెంట్లు అధికారులకు ఇచ్చానని తెలిపారు. ఇదే విషయంపై ఈడీ అధికారులు మళ్లీ రావాలని చెప్పారు.. నన్ను ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున.. ఇంత కంటే ఎక్కువ మాట్లాడడం నాకు మంచిది కాదని మీడియా ముఖంగా ఆమె సమాధానమిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *