మందుతాగి దొరికితే మీ ఆఫీస్ కి సమాచారం

మందుతాగి దొరికితే మీ ఆఫీస్ కి సమాచారం

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో మందుబాబులతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాళ్ళని నియంత్రించడానికి ఎన్ని డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నా ఇంకా చాలామంది మారడం లేదు. పైగా ఏటేటా వేల కేసులు పెరిగిపోతున్నాయి. ఎక్కువ ప్రమాదాలు కూడా వీటివల్లే జరుగుతున్నాయి.

ఇప్పటివరకూ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే పోలీస్ కేసులు బుక్ చేసి కోర్టుకు పంపడం లేదంటే వాళ్ళ కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడం లాంటి చర్యలు చేస్తున్నారు పోలీసులు. కానీ ఇప్పుడు రూటు మార్చారు. ఇకపై డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే… వాళ్ళు పనిచేస్తున్న ఆఫీసులు లేదా కంపెనీలకు సమాచారం అందిస్తున్నారు. ఇప్పటికే రాచకొండ పోలీసులు ఇలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిగో మీ ఉద్యోగి ఘనకార్యం చూడండి… మద్యం తాగి ఎలా వాహనాలు నడుపుతున్నాడో చూడమంటూ… కంపెనీల CEOలు లేదా సంస్థల ఓనర్లకు లెటర్లు రాస్తున్నారు. దాంతో ఇక ముందెప్పుడూ తాగి బండి నడిపే ప్రయత్నం చేయరన్నది పోలీసులు ప్లాన్ ఈ డిసెంబర్ 2021లో 18వ తేదీ నుంచి 24 వరకూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 413మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వాళ్ళ కంపెనీలకు ఇప్పటికే లెటర్లు రాసినట్టు పోలీసులు తెలిపారు

సో ఇక నుంచైనా మందు తాగి మండి నడిపితే … మీ ఆఫీసులో పరువు పోవడమే కాకుండా… మీ ప్రవర్తన బాగోలేదని ఉద్యోగం కూడా కోల్పోయే ఛాన్సుంది. బీ కేర్ ఫుల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *