సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం

సోషల్ మీడియాలో మతాల పేరుతో అసత్య వార్తలు పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశంలో కోవిడ్-19 వ్యాప్తికి తబ్లిగీ జమాత్ సమావేశాలే కారణమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆస్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరగడం అనేది… దేశానికే మాదకరమని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థల పట్ల సోషల్ మీడియాకు జవాబుదారి తనం లేదని ఆగ్రహించారు జస్టిస్.

ఇదే సందర్భంలో న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై సీజేఐ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంఘంలో పెద్ద హోదా కలిగిన వ్యక్తులు చెబితే మాత్రమే సోషల్ మీడియా సంస్థలు పట్టించుకుంటున్నాయని సీజేఐ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇదే సందర్భంలో దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో దాఖలైన సోషల్ మీడియా కేసులకు సంబంధించిన పిటిషన్లను సుప్రీం కోర్టుకు బదిలీ చేసి విచారించాల్సిన అవసరం ఉందని.. కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందించింది. ఆయా కేసులకు సంబంధించిన అన్ని పిటిషన్‌లను కలిపి విచారించడంపై నిర్ణయం తీసుకునేందుకు.. కేసును 6 వారాల తర్వాత ధర్మాసనానికి లిస్ట్ చేయాలని.. కేంద్ర ప్రభుత్వానికి సీజీఐ ఎన్వీ రమణ సూచించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలోని కేసులపై సుప్రీంకోర్టులో కేసుల విచారణపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ కేసుల బదిలీపై కూడా నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *