దుర్గాదేవి పూజా విధానం

దసరా శరన్నవరాత్రోత్సవాలలో ఆది పూజలందుకునే అమ్మవారు.. శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీకనకదుర్గాదేవి రూపంలో  భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తొలిరోజు అలంకరణ శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి

(శైలపుత్రి : రాహువు), ఎరుపుచీర ( కుజుడు), ఆవునేయి నివేదన ( శుక్రుడు), పొంగలి(పులగం)(శనీశ్వరుడు)

దుర్గాదేవి పూజను ఎవరు చేయాలి?  ఎందుకు చేయాలి ? ఎలా చేయాలి ?

పాడ్యమి రోజు అమ్మవారికి  శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అలంకారము చేసి , ఎరుపురంగు చీర సమర్పించి అవునెయ్యి, పొంగలి (పులగము)ని నైవేధ్యముగా నివేదన చేయడము ద్వారా జాతకములోని కుజ దోషము పరిహారము అవుతుంది , తద్వారా వివాహము కాక భాధపడే వారికి (విశిష్టంగా స్త్రీలకు) సకాలములో వివాహము అవుతుంది , మంచి జీవిత భాగస్వామి వస్తారు. అప్పటికే వివాహము అయ్యి వైవాహిక జీవితములో కలతలతో , స్పర్ధలతో భాధపడే వారికి (స్త్రీ , పురుషులిద్దరికి) వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. క్రొత్తగా వివాహము అయిన వారు చేయడము వలన దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగి వైవాహిక సుఖం లభిస్తుంది.

అలాగే జాతకము లో అంగారకుడు బలహీనంగా ఉండటము వలన సహజంగా అలవడే అనవసర ఆవేశము , మూర్ఖముతో కూడిన మొండితనము , తొడరపాటు తనము వంటివి తగ్గుతాయి. సంతానము కోసం ప్రయత్నించే వారికి ఆరోగ్య కరమైన పురుష సంతతి కల్గుతుంది.

ఆత్మన్యూన్యతా భావం ఉన్నవారికీ, అనవసర భయాందోళనలకు గురి అవుతూ ఇబ్బంది పడే వారికి ఇది చాలా ప్రసక్తమైన పరిహారము గా పనిచేస్తుంది.

పఠించవలసిన మంత్రము : ఓం దుం దుర్గాయై నమః

ఓం శ్రీ మాతా దుర్గా దేవి నమోనమః సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే…

దసరా శరన్నవరాత్రోత్సవాలలో ఆది పూజలందుకునే అమ్మవారు.. స్వర్ణకవచాలంకృత శ్రీకనకదుర్గాదేవి రూపంలో  భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం మాధవవర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ధర్మం నాలుగుపాదాల ఉండేటట్లుగా అత్యంత జనప్రియంగా పరిపాలించేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. ఒక రోజు రాజకుమారుడు నగర సందర్శనం చేస్తుండగా అతని రథచక్రాల కింద ఒక బాలుడు ప్రమాదవశాత్తూ పడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు దుఃఖించి రాజును న్యాయం చేయమని వేడుకుంటారు. రాజు విచారంతో తన కుమారుడే ఈ సంఘటనకు కారణమని తెలిసి మరణశిక్ష విధిస్తాడు. రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు మృతిచెందిన బాలుడిని బతికించడంతో పాటూ విజయవాటికాపురిలో కొన్ని ఘడియలపాటు కనకవర్షం కురిపిస్తుంది.  అప్పటినుంచి అమ్మవారిని కనకదుర్గగా కొలుస్తూ.. దసరా మహోత్సవాలలో తొలిరోజు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా  అలంకరించడం జరుగుతోంది.

ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దారిద్య్రములు తొలగిపోతాయని ప్రతీతి. నక్షత్రకాంతి కంటే ఎక్కువగా ప్రకాశించే ముక్కుపుడకను ధరించి నిండైన పచ్చని పసిడి వర్ణపు ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారు కనిపిస్తారు.

తొలి రోజు దుర్గాదేవి పూజా విధానం

పూజ అమ్మవారిని ఎలా పూజించాలి యధా శాస్త్రీయముగా విఘ్నేశ్వరపూజ చేసి, రక్షా బంధన పూజ చేసి, రక్షా బంధనాన్ని ధరించి, కలశ స్థాపన పైన చెప్పిన విధంగా చేసి, ప్రాణ ప్రతిష్ట కరన్యాసములు చేసి, షోడశ ఉపచారములతో శ్రీ సూక్త విధానంగా సహస్ర నామములతో, త్రిశతీ నామములతో, అష్ణోత్తర శతనామములతో, దేవీ ఖడ్గమాలా నామములతో, పసుపు, కుంకుమ, హరిద్రాక్షతలు, కుంకుమాక్షతలు, రక్తచందనాక్షతలు, శ్రీచందనాక్షతలు, బిల్వదళములు, తులసీదళములు, పరిమళ పుష్పాదులతో అర్చన చేసి , నవకాయ పిండి వంటలతో రకరకాలైన ఫలములను, చలివిడి, వడపప్పు, పానకము, తేనె, పంచదార, పెరుగు, నివేదన చేసి , మంగళహారతిచ్చి అమ్మవారిని ఈవిధంగా ప్రార్థించాలి.

పూజా విధానం:
దుర్గాదేవి పూజా చేసే ప్రతి ఒక్కరూ భూమిపైనే పడుకోవాలి 

తల్లీ! ఈ నవరాత్రులు నా ఈ శరీరాన్ని మనసును నీ అధీనం చేస్తున్నాను. నాచే ఈ నవరాత్ర ప్రతదీక్ష దిగ్విజయంగా నిర్వహింపచేసుకొని, నన్ను ఆశీర్వదించు తల్లీ అని ప్రార్థించాలి. ఈ విధంగా నవరాత్ర వ్రతము ఆరంభించిన దగ్గర నుండి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, స్నాన సంధ్యాదులు ముగించుకొని, త్రికాలార్చనగానీ, షట్కాలార్చనలతోగానీ అమ్మవారిని తృప్తి పరుసూ, ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసముండి, సాయంకాల అర్చన ముగించుకొని అమ్మవారికి మహా నివేదన గావించి నక్షత్రములను దర్శించి భోజనము చేయాలి. ఉల్లి, వెల్లుల్లి విసర్జించాలి. సాంసారిక సుఖానికి దూరంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. భూమిపైనే శయనించాలి.

అమ్మవారు అమ్మవారిని అను నిత్యం ఆరాధించాలి ప్రతి నిత్యము అమ్మవారిని నవదుర్గా రూపములో అలంకరించుకొని ఆరాధించాలి. అమ్మవారి యొక్క విగ్రహాన్ని స్థాపన చేసుకోదలచిన వారు అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి అష్టభుజాలతో, అష్టవిధ ఆయుధాలను ధరించి, సౌమ్య మూర్తియై అభయ ప్రదానం సౌమ్య స్వరూపిణిగా గానీ చతుర్భుజాలతో పద్మాసనం వేసుకొని సింహాసనం మీద కూర్చొని చతుర్భుజాలలో అభయ, వరద, పాశ, అంకుశములను ధరించి, సౌమ్య మూర్తిగా కిరీటములో చంద్రవంకను ధరించినటువంటి విగ్రహాన్నిగానీ స్థాపించుకొని ఆరాధించాలి.

పూజా ఫలితం ప్రతినిత్యము అమ్మకు ఏం చేయాలి ప్రతినిత్యము అమ్మకు ప్రియమైన చండీ సప్తశతీ, దేవీ భాగవత, సౌందర్యలహరి పారాయణలను చేసుకుంటూ వుండాలి. సువాసినీపూజ, కుమారీపూజ, శ్రీ చక్ర నవావరణార్చనాది అర్చనలతో అమ్మవారిని తృప్తి పరుస్తూ ఉండాలి. గీత, వాద్య, నృత్యాదులతో అమ్మవారికి ఆనందాన్ని కలుగచేయాలి. నామ సంకీర్తనలతో ఆ తల్లిని ఆనందింప చేయాలి. దీపాలు వెలిగించి ఆ తల్లికి సంతోషాన్ని కలుగచేయాలి. అమ్మవారికి ప్రియమైన శ్రీ విద్య, చండీ, దశమహావిద్యాది హోమాదులతో అమ్మను తృప్తిపరచాలి.

ఎర్రటి వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు ధరించాలి అమ్మకు ప్రియమైన బాలాషడక్షరీ, లలితాపంచదశాక్షరీ, రాజరాజేశ్వరీ మహాషోడశాక్షరీ, మహామంత్రాదులను యధాశక్తి జపించాలి. ఎర్రని వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఎర్ర చందనము, చందనము, పసుపు, కుంకుమ ధరించాలి. అమ్మకు ప్రియమైన ముత్యాల, పగడాల, రుద్రాక్ష మాలికలను ధరించాలి. అమ్మభావన కలిగి, అమ్మను ఆరాధిస్తుండాలి. పరుషమైన మాటలు, అమంగళకరమైన వాక్యాలు పలుకకూడదు. గోవులను శక్యానుసారముగా గ్రాసం పెట్టి నవరాత్రి వ్రతాన్ని ఆచరించాలి.

విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు. ఈ దుర్గాష్టోత్తర స్తోత్రాన్ని చదివినా , వినినా సమస్త పాపాలు పోతాయి. విజ్ఞాన వికాసాలు కల్గుతాయి. మనసారా నమ్మి స్తుతించినా సర్వరోగ విముక్తులై సర్వాభీష్టసిద్ధి పొందుదురు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *