“దుర్గ” లో ఈ హీరో ఎవరు..?

లారెన్స్ ఇన్ “దుర్గ” పోస్టర్ విడుదల
దెయ్యాలు సినిమాలు తీయ్యడంలో లారెన్స్ రాఘవ దిట్ట. ఇటీవల తీసిన చిత్రాలు ‘కాంచన’, ‘గంగ’, ‘శివ లింగ’ పెద్ద హిట్లనే చెప్పాలి.
హీరో రాఘవ రీసెంట్ గా ‘దుర్గ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో తానే నటించిన ‘దుర్గ’ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అన్ని సినిమాల కంటే చాలా భిన్నంగా ఉండబోతుందని పోస్టర్‌తో తెలిపారు.
ఆయన ‘ముని’ సిరీస్‌లో వచ్చిన చిత్రాల మాదిరిగా ‘దుర్గ’ ఫస్ట్లుక్లోను భయపెట్టే మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ఈ మూవీరలో లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తుండగా త్వరలో దర్శకుడు, త్వరలో నటీ నటులను పేర్లను వెల్లడించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రాన్ సినిమాతో పాటు ‘అధికారం’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు.