తెలంగాణలో భూకంపం.. భయాందోళనలో ఆ ప్రాంత వాసులు
తెలంగాణలో భూకంపం.. భయాందోళనలో ఆ ప్రాంత వాసులు
తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం భూమి కంపించింది. భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల జిల్లాలో వారం వ్యవధిలోనే భూమి కంపించడం ఇది రెండో సారి. దీంతో ఆ జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు.
ఈ భూకంపం రావడంతో బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులను అధికారులను హుటాహుటిన ఖాళీ చేయించారు అధికారులు. వీటితో పాటు కరీంనగర్, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో పలు కాలనీల్లోని జనాలు భయంతో రోడ్లపైకి వచ్చారు.