హైతీలో భూకంపం.. పెరుగుతున్న మృతులు 

హైతీలో భూకంపం.. పెరుగుతున్న మృతులు 

హైతీలో భూకంపం.. పెరుగుతున్న మృతులు  సంఖ్య 

రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదు

 హైతీలో భూకంపం.. 2వేల మందికి పైగా మృతి

గతవారంలో కరేబియన్ దేశం లో హైతీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.2గా నమోదు అయినట్లు తెలిసింది.. ఈ భూకంపం దాటికి 2వేల మందికి పైగా చనిపోయినట్లు ప్రకటించిన అధికారులు. 10 వేల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కలు ప్రకారం 1950 మంది మృతి చెందినట్లు సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఆస్పత్రుల దగ్గర తీవ్ర గాయలైన వారు వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారని తెలిపారు. హైతీలో ఎటుచూసినా భవనాలు కుప్పకూలి కనిపిపస్తుండడంతో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనికి తోడు హైతీలో గ్రేస్ తుఫాన్ ప్రభావంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయితే 2010లో హైతీలో భారీ భూకంపం రావడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు చాలా మంది చిన్నారు నిరాశ్రయులైన విషయం అందరికీ తెలిసిందే…  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంఘీభావం తెలిపింది. అత్యవసర వైద్యాన్ని అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *