హైతీలో భూకంపం.. 1300 మందికి పైగా మృతి

హైతీలో భూకంపం.. 1300 మందికి పైగా మృతి

హైతీలో భూకంపం.. 1300 మందికి పైగా మృతి

రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదు

 

హైతీలో భూకంపం.. 1300 మందికి పైగా మృతి

కరేబియన్ దేశం లో హైతీలో భారీ భూకంపంతో వణికిపోయింది.  భూకంప తీవ్రత 7.2గా నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం దాటికి 1300 మందికి పైగా చనిపోయినట్లు ప్రకటించిన అధికారులు. 5 వేల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. హైతీలో ఎటుచూసినా భవనాలు కుప్పకూలి కనిపిపస్తుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన పట్ల ప్రధాని ఏరియెల్‌ హెన్రీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థన మేరకు అమెరికా సహాయక విభాగం రంగంలోకి దిగినట్లు సహాయక చర్యలు చేపట్టారు. అయితే  రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమంగా 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయినట్లు అక్కడి ఏజెన్సీలు తెలిపాయి.  అయితే హైతీ మృతుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంఘీభావం తెలిపింది. అత్యవసర వైద్యాన్ని అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. వర్షాలు కురిసే ప్రభావం ఉందని కూడా అక్కడ వాతావరణశాఖ పేర్కోంది. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: