ఎలక్ట్రిక్ బండి కొనేవారికి గుడ్న్యూస్

ఎలక్ట్రిక్ బండి కొనేవారికి గుడ్న్యూస్
ఎలక్ట్రిక్ వెకిల్ కొనుక్కునే వారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలాంటి ఫీజు లేకుండా బండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని కేంద్ర సర్కార్ ప్రకటించింది. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమను ప్రొత్సహించాలని కేంద్రం చూస్తోంది. అయితే అదనపు ప్రోత్సహకంగా సెంట్రల్ మోటార్ వాహనాల చట్టాలను-1989 సవరించాలని కేంద్రం గతంలోనే ప్రతిపాదించింది.
రోజు రోజుకీ పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్ బండ్లు కొనేవారంతా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లుపై ఆసక్తి ఎక్కువగా చూపే అవకాశం లేకపోలేదు.
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇండియాలో పెట్రోల్ బండ్లు తయారుచేసే ఆటోమోబైల్ కంపెనీలు.. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని వేగవంతంగా చేసేందుకు కృషి చేస్తున్నాయి.ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేసే కంపెనీలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలను అందిస్తున్నాయి. సో… పెట్రోల్ బండి కంటే.. ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వినియోగ దారులను ఆకట్టుకునేందుకు పలు ఆటోమోబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఉదాహరణకు ఓలా ఎలక్ట్రిక్ వాహనాన్ని చూద్దామా మరి.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 150Khm
ఫేమ్ 11 స్కీమ్ కింద రూ.50వేల వరకు సబ్సిడి
ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్.. అయితే ఈ కంపెనీ రూ.50వేల వరకు సబ్సిడీ ప్రకటించింది. అయితే కేంద్రం ప్రకటించిన ఫేమ్-11 స్కీమ్ కింద మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఫ్యూచర్స్ ను రిలీజ్ రోజునే చెబుతామని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. అయితే 3.6kWH బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150Kms వరకు వెళ్తుందని, మా కంపెనీ హెల్మెట్ కూడా ఫ్రీగా ఇస్తోందని తెలిపారు. అయితే మా బుకింగ్స్ జులైలోనే రూ.499 నాన్ రిఫండబుల్ అమౌంట్ తో స్టార్ అయ్యాయని…బుకింగ్ చేసుకున్న వారికి ఇంటి దగ్గరకే బైక్ ను డెలవరీ చేస్తామని కూడా ఓలా కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు.