EPFO: కుటుంబ సభ్యుల కోసం 7లక్షల బీమా

EPFO: కుటుంబ సభ్యుల కోసం 7లక్షల బీమా
కుటుంబ సభ్యులకు ఈ నామినేషన్ ద్వారా ఇన్సూరెన్స్
ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎంప్లాయిస్ డిపాజిట్- లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. అయితే ఈ ఉద్యోగి భవిష్య నిధి(EPF) చందాదారుల కుటుంబాలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రవేశపెట్టిందే ఎంప్లాయిస్ డిపాజిట్- లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పథకం కింద ప్రస్తుతం EPF సభ్యుల కుటుంబాలకు గరిష్టంగా రూ.7 లక్షల బీమా లభించనుంది. ఉద్యోగం చేసే సభ్యులకు ఈపీఎఫ్ కట్ అయితే.. ఆయా కంపెనీల్లో.. ఆ కంపెనీ సభ్యుడు ఎవరైనా సరే ఉద్యోగంలో ఉండగా మృతి చెందినట్లయితే, కుటుంబ సభ్యులకు ఈ పథకం కింద బీమా ప్రయోజనాన్నిఅందజేస్తారు. అయితే రూ.7 లక్షల ఇన్యూరెన్స్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందేందుకు ఈపీఎఫ్ చందాదారులు తప్పనిసరిగా ఈ-నామినేషన్ ఫైల్ కానీ..ఆన్లైన్ ద్వారా కూడా ఇ-నామినేషన్ ఫైల్ చేయొచ్చు EPF ఓ ప్రకటనలో తెలిపింది. EPF/EPS నామినేషన్‌ను డిజిటల్‌గా ఎలా ఫైల్ చేయాలో దశల వారీగా తెలుసుకుందాం..
EPF నామినేషన్ ఆన్ లైన్ లో ఫైల్ చేసే విధానం:
తొలుతగా EPF అధికారిక వెబ్‌సెట్‌కు వెళ్లి అక్కడ ‘సర్వీసెస్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు ‘ఫర్ ఎంప్లాయిస్’ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడో మరో పేజీకి రీ-డైరెక్ట్ అవుతుంది. అప్పుడు కొత్తగా వచ్చిన Pageలో కనిపించే member UAN/ Online Services ’ పై క్లిక్ చేయాలి. వెంటనే మెంబర్ e-seva పోర్టల్‌కు రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ్ మీ UAN Number, Password, క్యాప్ఛా కోడ్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి. డ్రాప్ డౌన్ మెనూలో ఉన్న మ్యానేజ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి ‘e-nomination’ను ఎంపిక చేసుకోవాలి. కుటుంబ సభ్యుల వివరాలను ఎంటర్ చేయాలి.
ఒకరి కంటే ఎక్కువ సభ్యుల వివరాలను కూడా ఎంటర్ చేయొచ్చు. కుటుంబ సభ్యులలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా ఇక్కడ ఎంచుకోవచ్చు. మనము ఇచ్చిన వివరాలన్నింటినీ సరి చూసుకుని ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయాలి. తర్వాత పేజ్‌కు వెళ్లి ఇ-సైన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ అనేది మీ ఆధార్ కార్డ్‌కు అనుసంధానించిన ఫోన్ నెంబర్‌కు మాత్రమే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ‘e-nomination’ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
ఉద్యోగుల డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) కింద జీవిత బీమా ప్రయోజనాన్ని పెంచుతున్నట్లు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కనీస బీమాను రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు..గరిష్ట బీమా పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచినట్లు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.