కరోనాకు మెడిసిన్ గా ఎర్రచీమల చట్నీ..సుప్రీం కీలక వ్యాఖ్యలు

కరోనాకు మెడిసిన్ గా మిరకాయలు, ఎర్రచీమల చట్నీపై… పిటిషనర్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఎర్రచీమల చట్నీని పరిగణనలోకి తీసుకోలేమన్న ధర్మాసనం
దేశ వ్యాప్తంగా ఎంతోమంది చిట్కాలు పాటిస్తుంటారు
పిిటిషనర్ కి వ్యాక్సిన్ వేయించాలని సుప్రీం ఆదేశం
ఎవరూ ఊహించని విధంగా సుప్రీంకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. కరోనావైరస్ ను నివారణకు ఎర్రచీమల పచ్చడిని ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విపులంగా విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాకు విరుగుడుగా దీన్ని పరిగణనలోకి తీసుకోలేమని.. ఎర్ర చీమల పచ్చడిని ఉపయోగించాలని సిఫార్సు చేయలేమని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఏదో ఒక రకమైన వ్యాధి బారిన పడినప్పుడు తమకు తెలిసిన చిట్కాలను ఉపయోగిస్తుంటారని, ఆ చిట్కాలు వారికి పనిచేసినంత మాత్రాన దేశవ్యాప్తంగా వాళ్లు వాడే పద్దతిని పాటించాలని..ఆ విషయాలపై సుప్రీంకోర్టు చెప్పదని తేల్చి చెప్పింది.
అయితే ఈ సందర్భంగా పిటిషనర్ కి న్యాయస్థానం చెబుతూ.. కరోనా వైరస్ నివారణకు ఎర్రచీమల చట్నీని తినాలనుకుంటే తినొచ్చని, అది మీ ఇష్టమని.. దాన్ని ఎవరూ ఆపలేరని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకానీ మీరు సూచించిన చిట్కాలను… దేశ ప్రజలదరినీ కూడా అదే తినాలని.. సుప్రీంకోర్టు ఆదేశించలేదని తేల్చి చెప్పంది. అయితే సంప్రాదాయక చిట్కాలను పాటించే వారు అనుసరిస్తే..దానివల్ల వచ్చే పర్యవసనాలను పాటించిన వారే అనుభవించాల్సి ఉంటుందని.. ఏదైనా తేడా వస్తే అట్టివాళ్లదే బాధ్యత అని తెలిపింది.
అయితే సుప్రీంకోర్టులో ఒడిశాకు చెందిన గిరిజనుడు నయాధర్ పఢియాల్ దావా వేశారు. ఎర్రచీమలు, మిరపకాయలతో చేసిన పచ్చడిని జలుబు, దగ్గు, నీరసం, శ్వాస సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారని దీనిలో భాగంగా కరోనా వైద్య నివారణకు కూడా దీన్ని సిఫార్సు చేసేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు ఎర్రచీమలు, మిరపకాయలతో చేసిన పచ్చడిని సంప్రదాయ వైద్యంగా భావిస్తారని సదరు పిటిషనర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ చాలా రకాల ఇంటింటి సంప్రదాయ వైద్యాలున్నాయి. కానీ మన ఇంట్లోనూ కొన్నింటిని మాత్రమే ఉపయోగిస్తుంటామని…దీన్నీ దేశమంతటా అమలు చేయాలని అడగకూడదు అని.. న్యాయమూర్తులు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఒడిస్సా హైకోర్టులో.. ఇంజినీర్, రీసెర్చర్ నయాధర్ పాధియల్ ఎర్రచీమలు, మిరపకాయలతో చేసిన పచ్చడిని అనుమతించాలని పిటిషన్ వేశారు…దీనిపై స్పందిచిన ఒడిస్సా హైకోర్టు… ఎర్రచీమల పచ్చడిపై పరిశీంచి సమగ్ర నివేదిక ఇవ్వాలని శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి(CSIR), ఆయుష్ మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. అయితే ఆ డిపార్టుమెంట్ వారి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నయాధర్ పాధియల్ దావాను కొట్టివేసింది.
దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మళ్లా విచారించాల్సిన పనిలేదని..దీనిపై తీర్పు ఇస్తున్నామని క్లీయర్ గా తెలిపింది. ఇది ఇలా ఉండగా ధర్మాసనం.. ఎర్రచీమల చట్నీ పేరుతో కరోనా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉంటాడేమోనని.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి…వ్యాక్సిన్ వేయించాలని ఆదేశించింది.