ఎర్రకోటపై ప్రధాని కీలక ప్రకటన

ఎర్రకోటపై ప్రధాని కీలక ప్రకటన

ఎర్రకోటపై ప్రధాని కీలక ప్రకటన

సైనిక్ స్కూళ్లలో అమ్మాయిలకు ప్రవేశం

త్వరలో కాశ్మీర్ ఎన్నికలు

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి ప్రధాని మోడీ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి దగ్గర ప్రధాని నివాళులర్పించారు.

అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇకపై దేశ వ్యాప్తంగా అన్ని సైనిక్ స్కూళ్లలో ఇక నుంచి అమ్మాయిలకు సైతం ప్రవేశం కల్పిస్తామని..త్వరలోనే జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఎర్రకోట నుంచి ఆయన ప్రసంగించారు. ఆర్టికల్ 370ని రద్దు చేశామని… ‘ జమ్మూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబడిందని… భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. ఇదే క్రమంలో ‘సింధు సెంట్రల్ యూనివర్శిటీ’ లడఖ్‌ను ఉన్నత విద్యా కేంద్రంగా మార్చబోతోందని’ అని ప్రధాని మోడీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: