రోజూ 10 నిమిషాలు పరిగెత్తితే చాలు !

యోగా, వ్యాయామం చేయడానికి టైమ్ లేదని అనుకుంటున్నారా…!
కనీసం మీరు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు… !!
ప్రతి రోజూ ఒక మాదిరి వేగంతో పది నిమిషాలు పరిగెత్తితే మీ మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని యూనివర్సిటీ ఆఫ్ సుకుబ అధ్యయనంలో తెలిపింది. పది నిమిషాలు పరిగెత్తితే మెదడులో మూడ్ ను, జ్ఞాపకశక్తిని, ఆలోచనల తీరును నియంత్రించే భాగానికి రక్త ప్రసరణ పుంజుకుంటున్నట్టు వర్సిటీ స్టడీలో తేలింది. పరిగెత్తుతున్నప్పుడు శరీర నియంత్రణ, కదలికలు, వేగం లాంటివి ఒక సమన్వయంతో సాగుతాయి. ఇవి మెదడు చుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి. వ్యాయామం చేసినప్పుడు మనసుకు హాయిని ఇచ్చే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. అవి మూడ్ మెరుగుపడటానికి ఉపయోగపడతాయి.