తెలంగాణలో EWS రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ

తెలంగాణలో EWS రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ

తెలంగాణలో EWS రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు

రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ (EWS) రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని సీఎం ఆదేశించారు. అయితే గవర్నమెంట్ పోస్టులు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్‌ (EWS)రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. అయితే ఈ జీవో ప్రకారంగా SC, ST, BC రిజర్వేషన్లు వర్తించని.. తహాశీల్దార్ ఇచ్చే ఇన్ కమ్ సర్టిఫికెట్ ఆధారంగా ఈడబ్ల్యూఎస్‌ (EWS)అర్హత నిర్ణయిస్తారని,  తప్పుడు ధ్రువపత్రం అని తేలితే సర్వీసు రద్దుతో పాటుగా వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే ఈ విద్యాసంస్థల్లో EWS  కోటాలో ప్రస్తుతం భర్తీ కాని సీట్లను.. వచ్చే ఏడాదికి బదిలీ చేస్తామని సర్కార్ ఉత్తర్వుల్లో వెల్లడించింది. EWS నియామకాల్లోనూ మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేస్తామని.. మరియు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. SC, ST, BC తరహాలో ఎగ్జామినేషన్ ఫీజుల్లో మినహాయింపు ఉంటుంది. EWS కోటా కింద విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. అయితే ఈ రిజర్వేషన్ల కోసం సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలకు సవరణ చేశారు. ప్రభుత్వం నియమించే రిక్రూర్ మెంట్ లో రోస్టర్‌ పాయింట్లను అమల్లోకి తెస్తామని తెలిపింది. త్వరలో తెలంగాణలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సర్కార్ చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే EWS రిజర్వేషన్ల అమలు ఉత్తర్వులు జారీ  చేశారని నిరుద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *