గుడ్లు ఎక్కువ తింటున్నారా ? అయితే మీకు డయాబెటీస్ గ్యారంటీ !!

గుడ్లు ఎక్కువ తింటున్నారా ? అయితే మీకు డయాబెటీస్ గ్యారంటీ !!

రోజూ మోతాదుకు మించి కోడి గుడ్లను తీసుకునే వారికి మధుమేహం (డయాబెటీస్) వచ్చే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. గుడ్డు అంటే చాలామందికి ఇష్టం. ఇవాళ ఇంట్లో ఏ కూరగాయ లేకపోతే రెండు గుడ్లు ఉడకేసుకొనో… లేదంటే ఆమ్లెట్ వేసుకొనో లాంగించేస్తారు చాలామంది. అంతేకాదు.. కరోనా ఎటాక్ అయ్యాక ఇమ్యూనిటీ కోసం గుడ్లు తినమని వైద్యనిపుణులు కూడా సజెస్ట్ చేశారు. దాంతో చాలామంది 1,2 కాదు… ఏకంగా 5,6 గుడ్లను రోజూ తింటున్నారు. కానీ అతి సర్వత్రా వర్జేయత్ అన్నట్టు… ఒక అధ్యయనం ప్రకారం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు (అంటే 50 గ్రాములకు సమానం) తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 60శాతం పెరిగిందట. ఇంకో భయంకరమైన నిజం ఏమంటే… ఈ పరిస్థితి పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోందని రీసెర్చెస్ చెబుతున్నాయి.

పరిశోధన ఎవరు చేశారు?

చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతార్ యూనివర్సిటీ కలసి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఈ పరిశోధనలను 1991 నుంచి 2009 వరకూ నిర్వహించాయి. చైనాలోని పెద్దవయస్సున్న వాళ్ళపై ఈ సర్వే నిర్వహించారు. డయాబెటీస్ లక్షణాలు పెరిగినట్టు స్పష్టంగా గుర్తించామంటున్నారు ఎపిడమియోలజిస్ట్, పబ్లిక్ హెల్త్ ఎక్స్ పర్ట్ మింగ్ లీ చెప్పారు.
గతంలో తృణ ధన్యానాలు, కూరగాయలతో కూడిన సాంప్రదాయ ఆహారం తినే చైనీయులు ఇప్పుడు ఎక్కువగా మాంసం, స్నాక్స్ కూడిన ప్రాసెస్డ్ ఫుడ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అదే టైమ్ లో కోడి గుడ్ల వాడకం కూడా బాగా పెరిగింది. 1991- 2009 మధ్య కాలంలో కోడిగుడ్ల వినియోగం చైనాలో దాదాపు రెట్టింపు అయింది. ఇదే డయాబెటీస్ పెరుగుదలకు కారణమైందని అంటున్నారు మింగ్ లీ. ఈ ఆర్టికల్ బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో కూడా పబ్లిష్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *