ఫేస్ బుక్ ఇక మెటా
ఫేస్ బుక్ ఇక మెటా
- Facebook ఇకమీదట Meta పిలవబడుతుంది
- ఫేస్ బుక్ తన పేరును రీబ్రాండింగ్ చేసింది.
- జుకర్‌బర్గ్ ఈ రీబ్రాండ్ నిర్ణయాన్ని ప్రకటించారు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. పేరు మార్చుకుంది. ఇకపై Face Book ఇక మీదట Meta (మెటా) పేరుతో సేవలు అందించనుంది. ఆ సంస్థ సీఈవో జుకర్‌బర్గ్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో మెటావర్స్(వర్చువల్ రియాలిటీ) సాంకేతికతకు పెరగనున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పేరు పెడుతున్నట్టుగా స్పష్టం చేశారు.
ఫేస్బుక్ అనుబంధ సంస్థలైన వాట్సాప్, మెసేంజర్, ఇన్స్టాగ్రామ్ పేర్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయడం లేదని జుకర్ బర్గ్ తెలిపారు. ఈ సంస్థలన్నింటికి ఇన్నాళ్లు ఫేస్బుక్ మాతృసంస్థగా కొనసాగగా.. ఇప్పటి నుంచి మెటా ఆ స్థానంలో కొనసాగనుంది. వర్చువల్ రియాలిటీలో యూజర్లు సంభాషించుకొనేలా ఫేస్బుక్ తన ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దుతోంది. త్వరలో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇదిలా ఉంటే.. ఫేస్బుక్ సమాచార దుర్వినియోగానికి పాల్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతోనే, దాన్నుంచి ప్రపంచం దృష్టి మరల్చేందుకు పేరు మార్పురు తెరపైకి తెచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.