స్తంభించిన ఫేస్ బుక్.. జుకర్‌బర్గ్‌కు రూ.52 వేల కోట్ల నష్టం..

స్తంభించిన ఫేస్ బుక్.. జుకర్‌బర్గ్‌కు రూ.52 వేల కోట్ల నష్టం..

నేటి యువతరం నుంచి పెద్దలు దాగా సోషల్ మీడియా ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్రతీ స్మార్ట్ ఫోన్‌లో సోషల్‌ మీడియా యాప్స్‌ ఉండాల్సిందే.. చిన్న నుంచి పెద్ద అనే తేడా లేకుండా అంతా ఎక్కువ సమయం సోషల్‌ మీడియాతో గడుపుతున్నారంటే అందులో ఆశ్యర్యం లేదు.. కానీ, సోమవారం సోషల్‌ మీడియాలో  ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్న యాప్స్ లలో ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ దాదాపు 7 గంటల పాటుగా స్థంభించిపోయాయి.. అయితే ప్రతి ఒక్కరూ తమ వాట్సప్ సందేశాల కోసం ఈజీగా దాని వాడుకొంటారు. దీని స్థబంనతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఫేస్‌బుక్‌లో తమ కొత్త ఫోటోలు, మరియు వీడియోలు, సెలబ్రెట్రీలు, న్యూస్ ప్రెజెంటర్స్ తోపాటుగా వాణిజ్య కార్యకలాపాలు చేసే వారితో పాటుగా మరో ఎంతో మందికి ఇబ్బందులు తలెత్తాయి.

నిత్యం ఇన్‌స్టాలో పోస్టులు పెట్టేవారికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. యాప్స్ లో తమ సమాచారాన్ని లోడ్ చేసినప్పుడు, ఫోటోలు, కామెంట్స్, వాణిజ్య కార్యలాపాలు చేసినప్పుడు టెక్నిల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో పాటుగా యాక్టీవ్ గా ఉండే సెల్ ఫోన్ వినియోగదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్లీ, మళ్లీ ఆ యాప్స్‌ ఓపెన్‌ చూసి చూస్తే ఏమైనా ప్రాబ్లమోనని…ఇంకో దారి లేక మా ఫోన్ లో ఏదైనా సమస్య ఉందా అనే కోణంలో సెల్ ఫోన్ వినియోగదారులు బెంబేలేత్తారు.

సోషల్ మీడియాలో అత్యంత దగ్గరగా ఉండే ఫేస్‌బుక్ వినియోగదారులు ప్రభావం…ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పై భారీగానే పడిందట…ఆ పరిణామంతో కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 7 బిలియన్ డాలర్ల నష్టం.. అంటే ఇండిన్‌ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.52 వేల కోట్ల విలువైన ఆస్తులు నష్టపోయారు. ఆ నష్టంతో ప్రపంచకుభేరుల జాబితాలో మూడు స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయాడు ఫేస్‌బుక్ సీఈవో జూకర్‌ బర్గ్.

ఫేస్‌బుక్‌ స్తంభించిందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో ఆ సంస్థ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. దీంతో గతనెల మధ్య నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్ల విలువలో 15 శాతం తగ్గుదల నమోదైంది. కాగా, ప్రస్తుతం ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద 122 బిలియన్‌ డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. మొత్తంగా సోషల్‌ మీడియా డౌన్ తో ఫేస్‌బుక్ సీఈవో జూకర్‌బర్గ్‌కు గట్టిగానే దెబ్బకొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *