ఇండియాలో SMEలకు ఫేస్‌బుక్‌ రుణాలు

ఇండియాలో SMEలకు ఫేస్‌బుక్‌ రుణాలు

ఇండియాలో SMEలకు ఫేస్‌బుక్‌ రుణాలు

దేశ వ్యాప్తంగా 200 నగరాల్లో రుణ సౌకర్యం

ఇండియాలో రూ.5 లక్షలకు పైగా లోన్లు

సోషల్ మీడియా దిగ్గజాల్లో ఫేస్‌బుక్‌ (Facebook) ఒకటి..అయితే ఫేస్‌బుక్‌ భిన్నంగా ఆలోచించింది. అయితే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్న ఆలోచనతో ఇండియాలో చిన్న వ్యాపార ప్రకటనదారుల కోసం రుణాలిచ్చేందుకు  శ్రీకారం చుట్టింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ విస్తరించినప్పటీకీ.. కేవలం భారత్ లోనే ప్రస్తుతం 200 నగరాల్లో ఈ రుణ సౌకర్యాన్ని ఇచ్చేందుకు అంగీకారం చుట్టింది. అయితే ఫేస్‌బుక్‌ లో ప్రకటనలిచ్చే చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థ (SME)లు రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణ సహాయం పొందవచ్చునని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ఓ వర్చువల్‌ కార్యక్రమంలో వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ నిర్వహించిన సందర్భంగా ఈ రుణ సదుపాయాన్ని అందిస్తామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది.

అయితే భారత్ లో EDP ద్వారా ఎస్‌ఎంఈలకు ఫేస్‌బుక్‌ ఈ లోన్లలను మంజూరు చేయనుందని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. అయితే తక్కువ సమయంలోనే చిరు వ్యాపారులకు..రుణాలను సులువుగా ఇచ్చేందుకు కృషి చేస్తామని ఫేస్‌బుక్‌ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్‌ మోహన్‌ మీడియాకు స్పష్టం చేశారు.

అయితే దేశంలో కరోనాతో ప్రభావంతో ఎస్‌ఎంఈలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, లోన్లు లభ్యత ఇవ్వడానికి కష్టమైపోతుందని..ఈ రుణాలను తీసుకోనే వారు ఎలాంటి పూచీకత్తు లేకుండానే 17-20 శాతం వార్షిక వడ్డీరేటుతో రుణాలు తీసుకోవచ్చునని ఎండీ అజిత్‌ మోహన్‌ వెల్లడించారు. అయితే దేశ వ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వడ్డీరేటు 0.2 శాతం రాయితీగా ఇస్తామని తెలిపారు. EDP ద్వారా ప్రాసెసింగ్‌ ఫ్రీ గా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే వ్యాపారులకు లోన్లు ఇచ్చే అంశం, వారి దగ్గర నుంచి వసూళ్లు అంతా ఇండిఫీ దే బాధ్యత అని అన్నారు. చిరు వ్యాపారులు దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో లోన్లు మంజూరు చేయాలని, ఎంతమంది వ్యాపారులకైనా లోన్లు ఇస్తామని ఎండీ అజిత్‌ మోహన్‌ అన్నారు. అయితే తమతో కలిసి వచ్చే   సంస్థలు చేతులు కలిపితే బహిరంగ మార్కెట్‌లో చిరు వ్యాపారులకు మరిన్నీ లోన్లు ఇచ్చేందుకు సిద్దమని అన్నారు.

అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో న్యూఢిల్లీ, గుర్గావ్‌, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ సహా ఎస్‌ఎంఈలకు గత ఏడాదిలో ఆర్థికంగా ఆదుకునేందుకు గ్రాంట్లను మంజూరు చేసినట్లు ఫేస్‌బుక్‌ తెలింది. కరోనాతో ఇబ్బంది పడుతున్న సంస్థలకు ఈ ఆర్థిక సాయం అందించినట్లు ఫేస్‌బుక్‌ పేర్కొన్నది. అయితే ఈ ఐదు ప్రధాన నగరాల్లో 3వేల ఎస్‌ఎంబీలకు రూ.30 కోట్లు ఇచ్చామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి తమ యాప్‌లను ప్రతి నెలా దాదాపు రూ.20 కోట్ల వ్యాపారులు వినియోగిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ చెప్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *