బూస్టర్ డోస్ దొంగలున్నారు జాగ్రత్త !

బూస్టర్ డోస్ దొంగలున్నారు జాగ్రత్త !

దేశంలోని హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్, 60యేళ్ళు దాటిన వారికి సోమవారం నుంచి బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఈ బూస్టర్ డోస్ ను అడ్డంపెట్టుకొని… క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు … బూస్టర్ డోస్ ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసుకుంటున్నారు కేటుగాళ్ళు

మీరు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారా… అని అడుగుతున్నారు. అవును అని చెబితే… అయితే మీకు బూస్టర్ డోస్ బుక్ చేస్తున్నాం… మేం పంపించే లింక్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోండి అంటూ మొబైల్ కు లింక్ పంపుతున్నారు. లింక్ నొక్కిన తర్వాత వచ్చే otp చెప్పాలని అడుగుతున్నారు. పొరపాటున OTP చెబితే చాలు… బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు ఖాళీ చేస్తున్నారు. నిమిషాల్లో డబ్బులు మాయం అవుతున్నాయి.
అందువల్ల… బీకేర్ ఫుల్… బూస్టర్ డోస్ పేరుతో వచ్చే ఫేక్ ఫోన్ కాల్స్ నమ్మకండి… నమ్మి OTPలు చెప్పారో… మీ కష్టార్జితం సైబర్ క్రిమినల్స్ పాలు అవడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *