తాలిబన్ల రాజ్యంలో ఉక్రెయిన్ విమానం హైజాక్..!

తాలిబన్ల రాజ్యంలో ఉక్రెయిన్ విమానం హైజాక్..!

తాలిబన్ల రాజ్యంలో ఉక్రెయిన్ విమానం హైజాక్..!  

ఆఫ్గానిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ బీభత్సం సృష్టిస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి..అయితే ఆ దేశంలో నివసిస్తున్న ఉక్రెయిన్ దేశస్తుల్ని తీసుకెళ్లేందుకు ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి హైజాక్ కు గురైందని.. గుర్తుతెలియని వ్యక్తులు ఉక్రెయిన్ విమానాన్ని కాబుల్ నుంచి ఇరాన్ తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్ జెనీ యెనిన్ తెలిపారు. ఈ విమానాన్ని గత ఆదివారమే హైజాక్ కు గురైందని.. ఆ విమానంలో ఉన్న దేశస్తులు కూడా ఉక్రెయిన్ దేశస్తులు కారని.. మా దేశ ప్రయాణికులను కాకుండా వేరే దేశస్తుల ప్రయాణికులను తీసుకొని వెళ్లిపోయారని తెలిపారు. అయితే మా ఆఫ్గానిస్తాన్ లో ఉన్న ఉక్రెయిన్ దేశస్తులను తీసుకుని వచ్చేందుకు మాకు ఆటంకం కలిగిందని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్ జెనీ యెనిన్ చెప్పినట్లు.. రష్యా న్యూస్ ఏజెన్సీలో వార్తా కథనాలొచ్చాయి..అయితే ఆ విమానాన్ని హైజాక్ చేసేటప్పుడు వారి వద్ద ఆయుధాలున్నట్లు తెలిపింది. దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదని రష్యా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *