ఆన్ లైన్ లో నాసి రకాల అమ్మకాలు.. దిగ్గజ సంస్థలకు నోటీసులు

ఆన్ లైన్ లో నాసి రకాల అమ్మకాలు.. దిగ్గజ సంస్థలకు నోటీసులు

కరోనా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరూ ఏదీ కావాలన్నా ఆన్ లైన్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కు అలవాటుపడి ప్రతి ఒక్కటి ఆన్ లైన్ లోనే కొంటున్నారు. అయితే దీని భిన్నంగా నాసిరకం వస్తువులు అమ్మినందుకు గాను ఈ-కామర్స్ దిగ్గజాలైన ప్లిప్ కార్ట్, అమెజాన్లకు కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ నోటీసులు జారీ చేసింది. అయితే సదరు సంస్థలు బీఐఎస్ (BIS) మార్క్ కు లోబడి లేని కుక్కర్ లను అమ్మినందుకు ఆయా సంస్థలకు CCPA నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా నాసిరకం వస్తులలో భాగంగా పలు రకాల హెల్మెట్ల క్వాలిటీని పరిశీలించింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పలు సంస్థలపై కొరడా విసిరింది. నాణ్యత నియంత్రణ నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకున్నామని CCPA తెలిపింది. దీనిలో భాగంగా పేటీఎం, మాల్, స్నాప్ డీల్, షాప్ క్లూస్ తదితర ఈ కామర్స్ సంస్థలకూ కూడా నోటీసులు ఈనెల 18నే అందించామని తెలిపింది. అయితే ఆ సంస్థలు ప్రెజర్ కుక్కర్లతో పాటుగా మరో 13 రకలా ఉత్పత్తుల అమ్మాకాలపై కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ (CCPA) దృష్టి పెట్టింది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: