కిరాణా వ్యాపారులకు ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్

కిరాణా, చిల్లర కొట్లు వ్యాపారాలు చేసుకునేందుకు అనుగుణంగా.. వారికి మద్దతుగా నిలిచేందుకు ఫ్లిప్ హోల్సేల్ కొత్తగా ఒక ‘క్రెడిట్ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. చిల్లర వ్యాపారుస్తులకు అండగా నిలిచేందుకు IDFC Fist Bank బ్యాంకు భాగస్వామ్యంతో సులభ రుణాలను సమకూర్చనుంది.
అయితే కిరాణా వ్యాపారస్తుల ఇబ్బందులు, వ్యాపార వృద్ధికి నిధుల అవసరాలను తీర్చేందుకే.. ఈ రుణ సదుపాయాన్ని తీసుకొచ్చినట్టు ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా కిరాణా వర్తకులు ఎటు వంటి పెట్టుబడులు లేకుండానే రుణ సాయాన్ని IDFC First Bank బ్యాంకు, ఇతర ఫిన్టెక్ సంస్థల నుంచి పొందొచ్చని తెలిపింది. అయితే ఈ రుణాలను రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఇస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే 14 రోజుల కాలానికి ఎటువంటి వడ్డీ లేకుండానే ఇస్తామని తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఎన్నిరోజులు ఉంటుందనేది సంస్థ తెలుపలేదు.