సెప్టెంబర్ 10 నుంచి గణేష్ ఉత్సవాలు

సెప్టెంబర్ 10 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం
గణేష్ ఉత్సవాలపై మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.. అయితే సెప్టెంబర్ 10 న గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ లో అంగరంగ గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని… కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నా.. ఆంక్షలు పాటిస్తూ గణేష్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ లో వినాయక చవితి పండుగ జరుగనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి పండుగ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మట్టితో చేసిన గణపతులు, గో పేడతో చేసిన గణపతులు,ప్రకృతి సిద్దమైన గణపతులు కూడా తయారు చేస్తున్నారని వెల్లడించారు.