హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలపై హైకోర్టు ఆంక్షలు

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలపై హైకోర్టు ఆంక్షలు

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలపై హైకోర్టు ఆంక్షలు

హుస్సెన్‎సాగర్‏‎లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‎తో చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మా ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ సర్కార్ న్ని హైకోర్టు ఆదేశించింది.ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‎తో చేసిన విగ్రహాలను హుస్సెన్‎సాగర్‏‎లో నిమజ్జనం చేయకూడదని చెప్పింది. ఈ విగ్రహాల వల్ల హుస్సెన్‎సాగర్‏‎లో నీరు కలుషితం అవుతోంది కాబట్టే..ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాల కోసం రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అక్కడే ఈ విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని హైకోర్టు చెప్పింది. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో చేసిన విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ నిమజ్జనాల కోసం.. ఒకే రోజు హుస్సేన్ సాగర్‎కు రాకుండా తగిన ఏర్పాట్లు పర్యవేక్షించాలని, కోవిడ్ నిబంధనల మధ్య నిమజ్జనాలను ఏర్పాటు చేసుకోవాలని కోర్టు సూచించింది. చిన్న చిన్న మట్టి విగ్రహాలను ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేసేలా స్థానిక ఉత్సవ కమిటి పెద్దలను  ప్రోత్సహించాలని తెలిపింది.

గణేష్ నిమజ్జనం రోజున ప్రతి ఒక్కరికీ ఉచితంగా మాస్కులు అందించాలని చెప్పింది. నిమజ్జనం తర్వాత వెంటనే పూజా సామాగ్రితో సహా ఏదైనా చెత్త ఉంటే తొలగించాలని ఆదేశించింది.

నిమజ్జనానికి వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ తో పాటుగా సోషల్ డిస్టెన్స్ పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా మండపాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని.. గణేష్ మండపాల దగ్గర జనసమూహం గుమిగూడకుండా పోలీసులు చూడాలని అదేశించింది. గణేష్ ఉత్సవాలు జరిపే నిర్వాహకులు శానిటైజర్లు  ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల ద్వారా గణేష్ దర్శనాలను ప్రోత్సహించాలని హైకోర్టు చెప్పింది. రాత్రి 10 తర్వాత మైకులను అనుమతించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలన్నీ కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఆదేశాలను హైకోర్టు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *