దీపావళి లోపు గ్యాస్ ధర 100 పెరిగే అవకాశం..!

ప్రస్తుతం సిలిండర్ ధర- రూ.952
ఏడేండ్ల వంటగ్యాస్ సిలిండర్ ధరలో పెరుగుదల- రూ.538
3 నెలల్లో 4సార్లు పెంపు
రోజూ రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. దీంతో పాటుగా నిత్యావసర ధరలు కూడా భగ్గుమంటుండటంతో పండుగలను ఎలా జరుపుకోవాలని ప్రశ్న సామాన్యుడికి మరో పిడుగులాంటి వార్త. వచ్చేవారం నుంచి వంటగ్యాస్ ధరలు భారీగా పెరుగనున్నట్టు సమాచారం. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.100 పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి ధరను పెంచే అవకాశాలున్నాయి.
3 నెలల్లో 4సార్లు పెంపు
గడిచిన మూడు నెలల్లో వంటగ్యాస్ సిలిండర్ ధరలను నాలుగుసార్లు పెంచారు. గడిచిన జూలై నుంచి సిలిండర్‌పై ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.90 పెంచింది. ప్రస్తుతం ఒక్కో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.952కు చేరింది. దీంతో సామాన్యడిపై భారం పడుతోంది. ఎల్పీజీపై సబ్సిడీని ఎత్తేస్తూ గతేడాది కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ ధరలు ఒకేలా ఉంటున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.952, వైజాగ్‌లో సిలిండర్ ధర రూ.908,ఢిల్లీలో రూ.899.50 వద్ద, ముంబైలో రూ.899.50గా ధరలు ఉన్నాయి.