మూడోరోజు ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవి అలంకారం

మూడోరోజు ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవి అలంకారం

మన హిందువుల పండుగలలో ముఖ్యమైనది దేవీ శర్నవరాత్రులు. అయితే ఈ నవరాత్రుల్లో పూజలు చేస్తే పాపాలు తొలుగుతాయని అంటారు. ఇదీ మన పూర్వీకుల కాలం నుంచి వస్తుంది. పండుగలలో అన్నింటిలో పెద్ద పండుగా దేవీశరన్నవరాత్రులు.

దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు అలంకారంగా గాయత్రీ దేవి రూపాన్ని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. గాయత్రీదేవి తాంబూలం, కుమారి పూజలు చేసుకోవచ్చు. పటించాల్సిన మంత్రం.. ఓం గాయత్రీ మాత్రే నమః

అమ్మవారి చీర రంగు: కాషాయం రంగులో అమ్మవారిని అలంకరించాలి.

గాయత్రీ దేవికి అలంకరణ: తామరపూలు అంటే గాయత్రీ దేవి అమ్మవారికి చాలా ఇష్టం. కావున తామరపూలతో పూజిస్తే మనం అనుకున్న కోర్కెలు నెరవేరి మనల్ని దీవిస్తుందట ఆ తల్లి

గాజులు: అమ్మవారికి ఎర్రటి గాజులంటే ఇష్టం, ఇవాళ ఎర్రటి గాజులను ముత్తైదువులకు దానంగా ఇస్తే మంచిది.

అమ్మవారికి నైవేద్యం: నిమ్మకాయ అన్నం, లేదా చింతపండు పులిహార అంటే గాయత్రీ దేవీకి చాలా ఇష్టం.గాయత్రీ దేవీని చంద్రఘంటా దేవి అనేపేరుతో కూడా పిలుస్తారు.

వండని కూరగాయ: ఈరోజు వంకాయ కలిపిన ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు.

అమ్మవారి అష్టోత్తరాన్ని చదివినా మంచి ఫలితం ఉంటుంది. గాయత్రీ మాత అంటే సూర్య భగవాణుడి శక్తి. సకాల దోషాలు పోయి సుఖసంతోషాలతో అంటారు.

గాయత్రీ దేవీ కథ వృత్తాంత్తము:

ఇదే సందేహామును నివృతి చేసుకునేందుకు వశిష్ఠ మహర్షికి వచ్చిన వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా , స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు , వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి , సావిత్రితో వేదాలు , వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.

వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.

నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి , పురుషార్థ , పరాక్రమ , వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.

ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.

శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య , జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.

రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి , భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.

లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం , సంపద , పదవి , వైభవం , ధనం , యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.

అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం , శక్తి , తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.

మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత , అనారోగ్యాలు , శతృభయాలు , భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.

సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని , వివేకాన్ని , బుద్ధిని ప్రసాదిస్తుంది.

దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి , శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి , నిష్ఠ , కర్తవ్య పరాయణ తత్వం , బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.

భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని , ధైర్యాన్ని , దృఢత్వాన్ని , నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.

సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని , సుదీర్ఘ జీవనాన్ని , ప్రాణశక్తికి , వికాసాన్ని , తేజస్సును ప్రసాదిస్తాడు.

శ్రీరాముడు: ధర్మం , శీలం , సౌమ్యత , మైత్రి , ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.

సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి , అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.

చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం , క్రోధం , మోహం , లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.

యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.

బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత. బ్రహ్మ ఆజ్ఞ లేనిది చీమైన పుట్టదు అని అంటుంటారు మన పెద్దలు

వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని , దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.

నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని , సాహసాన్ని ప్రసాదిస్తాడు.

హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.

తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి , దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.

శ్రీ గాయత్రీ మాత మహాత్యం :

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్

భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం , సంకల్ప బలం , ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ , వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని , ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ 10సార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలోనప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి,కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి , సృష్టి ఉత్పత్తి , వర్తన , పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహాఋషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

గాయత్రి మంత్రాక్షరాలు :

సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం

సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే

‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’

గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం , గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి , దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.

ఇక్కడ శ్రీ గాయత్రి అష్టోత్తర శత నామావళి పఠించాలి.

ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒడుకు కానీ వారికి ఒడుకు చేయిస్తుంటారు. గాయత్రీ మంత్రోపదేశాన్ని ఉపదేశిస్తుంటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *