ఈ కాలంలో రోజూ తప్పనిసరిగా ఇది తినాల్సిందే..ఎందుకో తెలుసా..?

ఈ కాలంలో రోజూ తప్పనిసరిగా ఇది తినాల్సిందే..ఎందుకో తెలుసా..?

సాధారణంగా నెయ్యి వాడకాన్ని ప్రతి ఇంట్లో వాడని వారుండరు. ముఖ్యంగా కాలానుగుణంగా మనం ఎన్నో రకాల పద్దతుల్ని అవలంభిస్తుంటాం. దీనిలో భాగంగా చలికాలం మొదలైందంటే చాలు.. ప్రతి ఒక్కరిలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. దీంతో పాటుగా చర్మ సమస్యలను ఎదుర్కొంటూ ఎంతో బాధపడుతుంటారు.

 1. అయితే కొంతమంది శరీరం డ్రైనెస్, హాట్ నెస్ అనే విధంగా ఉంటాయి. దీనిలో భాగంగా మనం నెయ్యి వాడొచ్చా అనే దానిపై కొంత అభ్యంతరాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ విధమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఏ నెయ్యి వాడితే మంచిదో తెలుసుకుందామా మరి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా మరీ…
 2. అనాధిగా ఆయుర్వేదం లో  నెయ్యికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్వచ్చమైన ఆవు నేతిని కాచిన పాలలో కలిపి, అందులోనే ఒకటి రెండు చుక్కలు కుంకుమ పువ్వు, మూడు నాలుగు చుక్కలు తేనె, చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే ఇమ్యూనీటీని బూస్ట్ చేసి, బేబీ యొక్క బ్రెయిన్ హెల్త్ ని ప్రమోట్ చేసి, సేఫ్ డెలివరీకి సాయపడుతుందని చెప్తారు.
 3. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. కాగా, శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి ఎంతో సహాయం  చేస్తుంది.
 4. విటమిన్ ఏ, ఈ, కే, డి లు పుష్కలంగా ఉంటాయి. ఈ నెయ్యి తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి అలెర్జీలు, ఫ్లూ, జలుబు, దగ్గు వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయం చేస్తుంది.
 5. చలికాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యలలో చర్మ సమస్య ఒకటి. చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల చర్మంపై పగుళ్లు ఏర్పడతాయి. ఇదే సమయంలో మనం శరీరానికి టాల్క్ పౌడర్లు, క్రిములు తెగ వాడేస్తుంటారు. దీంతో చర్మ సమస్యలు వస్తుంటాయి.
 6. టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి పగుళ్ళకు పట్టించడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా మన కాళ్ల పగుళ్లు బాగా వస్తాయి. నెయ్యితో చక్కటి పరిష్కారం లభిస్తుంది.
 7. చలికాలంలో చలి తీవ్రతను తట్టుకోలేని వారు ప్రతి రోజూ ఆవకాయ, వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. దీంతో పాటుగా వస్త్రధారణ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే మరీ.
 8. చాలా మందికి చలి కాలంలో జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి వారు ప్రొద్దునే లేచినప్పుడు పరిగడుపున గొరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ నెయ్యి  వేసుకొని తింటే బాగుంటుంది. పడుకునేముందు గోరువెచ్చని పాలలో ఒకస్పూన్ నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణ సమస్యలతో పాటుగా మంచి నిద్ర కూడా పడుతుంది. ముఖ్యంగా మలబద్దకం ఉండదు. సుఖంగా విరేచనం అవుతుంది.
 9. ప్రతిరోజూ ఆహారంలో నెయ్యి కలుపుకుని తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజన్‌లో వచ్చే శ్వాసకోశ సమస్యలతోపాటు ఇతర వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. అందుకని చలికాలంలో నెయ్యిని కచ్చితంగా తీసుకోండి..!
 10. మనం తినే భోజనంలో నిత్యం నెయ్యిని వేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా మేధా శక్తి పెరుగుతుంది. అయితే ఇది ఆయుర్వేద నిపుణులు చెప్పిన ప్రకారంగా మాత్రమే వాడాలి.
 11. కొంతమందికి నెయ్యి వాడితే కొలెస్ట్రాల్ వస్తుందని చెబుతుంటారు. కానీ అది నిజం కాదని కొన్ని సర్వేలలో తేలింది. మనం వాడే నూనెల్లో కూడా తేడా ఉండొచ్చు.. శరీర తత్వాన్ని బట్టి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చక్కర వ్యాధి గ్రస్తులు నెయ్యిని తినొచ్చా..?

 1. చక్కెర వ్యాధిగ్రస్తులు నిర్భయంగా నెయ్యి తినవచ్చునని నిపుణులు చెపుతున్నారు. డయాబెటిస్ ఉన్న వారు నెయ్యిని తినవడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
 2. నెయ్యిలో సమృద్ధిగా ఉండే లినోలీయిక్ యాసిడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. రోజూ నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
 3. బాగా లావుగా ఉండే టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెయ్యి ఇది మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే విటమిన్ కె డయాబెటిస్ ఉన్న వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *