GHMC పరిధిలో కరోనా వ్యాక్సిన్లు

GHMC పరిధిలో కరోనా వ్యాక్సిన్లు

GHMC పరిధిలో కరోనా వ్యాక్సిన్లు

హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నుంచి 10 రోజులపాటు కొవిడ్ టీకా పంపిణీ  కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అయితే దశల వారిగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.అయితే 100శాతం కోవిడ్ నియంత్రణలో భాగంగ ప్రత్యేక డ్రైవ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు.

అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలోని మెట్టుగూడ, సీతాఫల్‌మండి,  అడ్డగుట్ట, తార్నాక, బౌద్ధనగర్‌ డివిజన్ల పరిధిలో ప్రతి డివిజన్‌కు ఓ సంచార వాహనాన్ని ఏర్పాటు చేసి దాదాపు 126 కాలనీలు, బస్తీల్లో ఇంటింటికెళ్లి సర్వేను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, ఎంటమాలజీ బృందాలు అన్నీ కలిసి కరోనా టీకా తీసుకొని కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి వారి జాబితాలు సేకరించిన తరువాత వారందరికీ టీకాలు ఇవ్వాలని అధికారులు ఆదేశాలిచ్చారు. దీని తరువాత ఆ బృందాలు కలిసి ఇంటింటికీ వెళ్లి మొబైల్ వ్యాక్సిన్  డ్రైవ్​ను ప్రదర్శించి అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తివుతుంది. బల్దియా ఉన్నతాధికారులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు అప్పడప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్విలు ఆకస్మిక తనిఖీ చేస్తారని సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: