సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత

ఏ హీరోయిన్ అయినా జీవితంలో ఎంతో ఎత్తు ఎదిగిన చివరికీ జీవితంలో స్థిరపడక తప్పదు.. ఒకరికి భార్య కాక తప్పదు మరీ..  అయితే “ ఏ మాయ చేశావే” సినిమాతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని స‌మంత మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆ సినిమానే వారి ప్రేమకు దారి తీసిందని టాక్.. అయితే ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో సమంత స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతుంది. అయితే కొన్ని చిత్రాల్లో నటించాలని వచ్చినా తను సినిమాలకు సైన్ చేయడం లేదంటా..అని సినిమా వర్గాల్లో టాక్

అయితే సమంతకు పెళ్లైనా సినీ ఇండస్ట్రీలో మాత్రం క్రేజ్ త‌గ్గ‌లేదు. ఒక‌వైపు సినిమాల్లో నటిస్తూనే.. మ‌రో వైపు వెబ్ సిరీస్‌లలో బిజిగా.. వాణిజ్య ప్రకటనలు, సోష‌ల్ మీడియాలలో తెగ సంద‌డి చేస్తోంది ఈ భామ. అయితే చేతి నిండా బిజినెస్, సినిమా ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులు, ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. దీంతో భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటోంది.

అయితే తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో దాదాపు 10ఏళ్లుగా ఉన్న స‌మంత త‌న అందం చందాలు, అభిన‌యంతో సినీ ప్రేక్షకుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అయితే పెళ్లి త‌ర్వాత విభిన్న పాత్రలు ఎంచుకున్న సమంత ఇటీవ‌ల ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌లో తనదైన శైలిలో నెగిటివ్ పాత్ర పోషించి సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమాకు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో అవార్డు అందుకుంది. అయితే తెలుగులో శాకుంత‌లం చిత్రం ద్వారా తన కెరీర్‌లో చారిత్రాత్మ‌క చిత్రం చేస్తుంది. ఇటీవ‌ల ఈ షూటింగ్ పూర్తి చేసిన సామ్ ప్ర‌స్తుతం కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాలో న‌టిస్తుంది.

అయితే శాకుంత‌లం, కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాలు రిలీజ్ త‌ర్వాత స‌మంత సినిమాల‌కు బ్రేక్ చెప్పబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాదాపు ద‌శాబ్ధ కాలంగా సినిమాలు, వాణిజ్య, ప్రకటనలతో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న స‌మంత కొద్ది రోజులు విలువైన స‌మ‌యాన్ని కుటుంబంతో గడపాలని అనుకుంటుంద‌ట‌. అయితే అక్కినేని వారసత్వానికి స‌మంత ఓ గుడ్ న్యూస్ చెప్పనుందని అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే నిజమయితే సినీ ఇండస్ట్రీలోకి తాతా వారసత్వం పుచ్చుకోనున్న మరో ఘరానా బుల్లోడు రానున్నాడని.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న అక్కినేని సమంత, నాగచైతన్య ఫ్యాన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *