గ్రీస్ లో కుప్ప కూలిన విమానం..మంటలార్పుతూ కూలిన విమానం

గ్రీస్ లో కుప్ప కూలిన విమానం..మంటలార్పుతూ కూలిన విమానం

గ్రీస్ లో కుప్ప కూలిన విమానం..మంటలార్పుతూ కూలిన విమానం

గ్రీస్‌లో అగ్నిమాపక విభాగానికి చెందిన విమానం ఆదివారం నాడు కూలిపోయింది. ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక దళం ప్రకటించింది.  గ్రీస్‌, టర్కీలో రెండు వారాలుగా అగ్ని ప్రమాదాలతో అడవులు అంతా దగ్ధమవుతున్నాయి. గ్రీకు ద్వీపమైన ఎవియాలో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ విమనాలు, హెలికాప్టర్లలో వెళ్లి మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే  పశ్చిమ గ్రీస్‌లోని అయోనియన్ ద్వీపంతో పాటు జాకింతోస్‌లో మంటలను అదుపుచేసే సమయంలో పెజెటెల్ విమానం కూలిపోయిందని.. పైలట్ సురక్షితంగా ఉన్నాడని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక దళం తెలిపింది.

అగ్ని ప్రమాదాల నేపథ్యంలో 17 అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్‌లు రెండో అతిపెద్ద ద్వీపమైన ఎలివియాలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని..గ్రీస్  పౌర రక్షణ ఉప మంత్రి నికోస్ హర్దాలియాస్ తెలిపారు. మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఓ విమానం అదుపుతప్పి కుప్పకూలిపోయిదని.. ప్రమదాన్ని పసికట్టిన పైలట్ పారాచూట్ సాయంతో దూకేయడంతో ప్రాణాపాయం తప్పిందని అధికారి తెలిపారు.

ఈ ప్రాంతంలో కొన్ని ఏండ్లుగా భూమిలో ఒత్తిడి ఎక్కువై, కొండప్రాంతాల నుంచి తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని.. అధికారులు చెబుతున్నారు. అయితే  ఇప్పటి వరకు మంటల్లో చిక్కుకొని గ్రీస్‌లో ఇద్దరు.. టర్కీలో 8 మంది మృతి చెందారని అధికారులు పేర్కోన్నారు.

అయితే చిరుగాలులతో వర్షం కురవడంతో టర్కీలో వేడిగాలుల నుంచి కొంత ఉపశమనం కలిగించినా… గ్రీస్‌లో మాత్రం భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతూనే ఉన్నాయి.. ప్రకృతి బీభత్సానికి అక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు.. ఎప్పుడు ఏం జరుగుతుందని ప్రజల్లో ఆందోళన నెలకొందని..సహాయక చర్యల్లో పాల్గొంనేందుకు కొంత ఇబ్బందులు తలెత్తున్నాయని అధికారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *