GSLV-F 10 రాకెట్‌ ప్రయోగం విఫలం

GSLV-F 10 రాకెట్‌ ప్రయోగం విఫలం

GSLV-F 10 రాకెట్‌ ప్రయోగం విఫలం

శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 10 రాకెట్‌ ప్రయోగం విఫలమయ్యింది. రెండు స్టేజీల వరకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ క్రయోజనిక్…మూడో దశలో రాకెట్‌ గతి తప్పింది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. లైవ్‌సోర్స్‌ను నిలిపి వేశారు. దీంతో జీఎస్‌ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్‌ ప్రకటించారు.

అయితే దీని ప్రయోగం సరిహద్దుల పర్యవేక్షణ, ప్రకృతి వైపరీత్యాల అంచనా కోసం జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ శాటిలైట్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–10) ప్రయోగించేందుకు బుధవారం వేకువజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. గురువారం ఉదయం 5.43​​​ గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 10 రాకెట్‌ను ప్రయోగించారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య రావడంతో ప్రయోగం విఫలమయ్యింది.

భూ పరిశీలన కోసం దీన్ని ప్రయోగించారు. నీటివనరులు, పంటలు, అడవులు, హిమానీనదాలు, సరిహద్దుల్లో అంచనా తదితరాల గురించి ఇది నిరంతర సమాచారం అందించాల్సి ఉంది. భవిష్యత్‌లో జరగబోయే ప్రకృతి వైపరీత్యాలను ఈ ఉపగ్రహం ద్వారా ముందే పసిగట్టవచ్చు. అయితే రాకెట్‌ క్రయోజెనిక్‌ దశలో సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగం విఫలమైంది. గతేడాది మార్చిలోనే ఈ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ కరోనా ఉద్ధృతి, సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: