థియేటర్లలో సందడి చేయనున్న గల్లీ రౌడీ..

థియేటర్లలో సందడి చేయనున్న గల్లీ రౌడీ..

థియేటర్లలో సందడి చేయనున్న గల్లీ రౌడీ.. 

జి.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో ‘గల్లీ రౌడీ’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సందీప్‌ కిషన్‌, నేహా శెట్టి జంటగా నటించారు. ఎం.వి.వి సత్యనారాయణ  ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది.  అయితే మూవీ షూటింగ్‌ ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఇటీవల ప్రభుత్వం సినిమా థియేటర్లకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 17న విడుదల చేయనున్న ఈ మూవీపై  భారీగానే అంచనాల మధ్య తెరకెక్కనుంది.

ఈ సినిమా ట్రైలర్‌ విడుదల తర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయని చెప్పొచ్చు. ఈ మూవీలో హాస్యభరితమైన సన్నివేశాలు, యాక్షన్‌ ప్రేక్షకులు మెచ్చుకునే విధంగా.. తరతరాలుగా వచ్చిన రౌడీయిజాన్ని భుజానికెత్తుకున్న గల్లీ రౌడీగా హీరో సందీప్‌ తనదైన శైలిలో నటించిన సన్నివేశాలను ఈ మూవీలో చూపించారు.

ఈ మూవీలో బాబీ సింహా పోలీస్‌ అధికారిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్‌ హీరోయిన్‌ తండ్రిగా నటించారు. సినిమాలోని పాత్రలో ఇమిడిపోయి నటకిరీటీ రాజేంద్రుడు అతి భయస్తుడి పాత్రలో కనిపిస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ మూవీ విడుదల తేదీ ఖరారు అవ్వడంతో చిత్ర యూనిట్‌.. గల్లీరౌడీ ప్రమోషన్‌లో భాగంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందుకు యూవీ యూనిట్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. అయితే ఈ ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మూవీ తెగ వైరల్ అవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *