రష్యా: కురిల్ సరస్సులో కూలిన హెలికాఫ్టర్

రష్యా: కురిల్ సరస్సులో కూలిన హెలికాఫ్టర్

రష్యా: కురిల్ సరస్సులో కూలిన హెలికాఫ్టర్

సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది 

రష్యాలో పర్యాటకులతో వెళ్తున్న MI-8 హెలికాప్టర్‌ గురువారం నాడు కురియల్ సరస్సులో తెల్లవారుజామున కూలిపోయింది. సుందర ప్రాంతాలను సందర్శించేందకు నిత్యం పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. ఫ్రాన్స్ 24 అనే వార్తా పత్రిక ప్రకారం హెలికాప్టర్ లో 16 మంది ప్రయాణీకులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్టు అధికారులు ప్రకటించారు. గల్లంతైన వారి కోసం రక్షక దళాలు గాలిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలోని కురిల్ సరస్సులో హెలికాప్టర్‌ కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఇది సెయింట్ పీటర్స్‌బర్గ్ నుండి పర్యాటకులను తీసుకువెళుతోందని ఫ్రాన్స్ 24 న్యూస్ ఎజేన్సీ తెలిపింది.

అయితే రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు కొనసాగుతోందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే 9మందిని రక్షించిన వారిని ఖోడుట్కాకు తరలించామని తెలిపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా కమ్చట్కా ప్రాంతాలు ఎంతో సుందరంగా.. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అందుకే ఈ  అగ్నిపర్వతాలు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలను.. సందర్శించేందుకు  పర్యాటకులు

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: