ఆఫ్గానిస్తాన్ – ఇండియా.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

ఆఫ్గానిస్తాన్ – ఇండియా.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

ఆఫ్గానిస్తాన్ – ఇండియా.. హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించిన కేంద్రం

ఆఫ్గానిస్తాన్ లో రోజురోజుకి తాలిబన్ల అరాచకం పెట్రేగిపోతుంది. అయితే దేశం విడిచి వెళ్లేందుకు ఆఫ్గానిస్తానీయులతో సహా ఇండియన్లు కూడా భయంతో ఎయిర్ పోర్టుల వైపు పరిగెడుతున్నారు. అయితే ఆఫ్గానిస్తాన్ లో చెరలో చిక్కుకున్న భారతీయులు, ఆఫ్గానియుల కోసం ఇండియా సర్కార్ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. క్షేమంగా తీసుకొచ్చందుకు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ఆఫ్గాస్తాన్ ప్రజలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది.

అమెరికా అధ్యక్షుడి సూచనతో ఆఫ్గానిస్తాన్ నుండి అమెరికా సేనలు వైదొలగి పోవడంతో అక్కడి ప్రభుత్వాన్ని తాలిబన్లు కూల్చివేశారు. ఆఫ్గానిస్తాన్ లో తాలిబన్లు అధికారం పీఠం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆఫ్గానిస్తాన్ ను  విడిచి వెళ్లేందుకు వేలాదిగా అఫ్గానిస్తాన్ ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాశ్రయాలకు క్యూ కడుతున్నారు. అయితే మార్గమద్యంలో ఆఫ్గానిస్తాన్ ప్రజలపై తాలిబన్లు కాల్పులు జరుపుతున్నారు. అక్కడి పరిస్థితి చాలా దీనంగా ఉందని చెప్పొచ్చు.

ఇండియా వాట్సాప్ : +91 8010611290 ; +91 9599321199 ; +91 7042049944

ఇండియా హెల్ప్ లైన్ నెంబర్లు : +91 11 4901 6783 ; +91 11 4901 6784 ; +91 11 49016785

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *