నటి హేమ వ్యాఖ్యలపై మండి పడ్డ నరేష్

హేమ నిరాధారామైన ఆరోపణలు చేస్తోంది.
క్రమ శిక్షణ చర్యలు తీసుకొంటాం.
నటి హేమ వ్యాఖ్యలపై మండి పడ్డ నరేష్.. ప్రస్తుత మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు నరేశ్.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఇటీవల హేమ చేసిన ఆరోపణలపై స్పందిచిన నరేశ్.. ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా నటి హేమ మాట్లాడుతున్నారని నరేశ్ అన్నారు.
గతంలో వార్తలు, మీడియాలో నటి హేమ “మా” పై సంచనల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..దీనిలోనే భాగంగానే హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా.. కమిటీ నిర్ణయం ప్రకారం హేమ పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం నిర్వహించి హేమపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులకు అనుగుణంగానే “ మా” ఎన్నికలు జరుగుతాయని వివరించారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ‘మా’ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ నెలలో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్రకటించారు. దీనిపై సినీ వర్గాల్లో, అభిమాన సంఘాలు, ప్రేక్షకుల అందరి చూపు సిని‘మా’ పరిశ్రమపై పడింది. అయితే మాలో పోటీ చేసే ఐదుగురు సభ్యులు.. ‘మా’కు శాశ్వత భవనం ఏర్పాటు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అయితే ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ను ప్రకటించారు. హీరో విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నవారిలో ఏ ప్యానల్ గెలుపును ఆదరిస్తారో వేచి చూడాల్సిందే..